శ్రీనుకు అంత సీను లేదంట

ఒకసారి విపలమైతే బ్యాడ్ లక్ అంటారు. రెండోసారి విఫలమైతే, కాస్త జాగ్రత్త పడాలి కదా అంటారు. ముచ్చటగా మూడోసారి ఫెయిలయితే అలవాటైపోయింది అంటారు. అదే టాలీవుడ్ లో అయితే సరుకు అయిపోయింది అనుకుని పక్కన…

ఒకసారి విపలమైతే బ్యాడ్ లక్ అంటారు. రెండోసారి విఫలమైతే, కాస్త జాగ్రత్త పడాలి కదా అంటారు. ముచ్చటగా మూడోసారి ఫెయిలయితే అలవాటైపోయింది అంటారు. అదే టాలీవుడ్ లో అయితే సరుకు అయిపోయింది అనుకుని పక్కన పెట్టేస్తారు.

దర్శకుడు శ్రీనువైట్ల పరిస్థితి ప్రస్తుతం టాలీవుడ్ లో ఇదే. హిట్ లు, ఏవరేజ్ లు ఇచ్చిన డైరక్టర్లకే ఇక్కడ సినిమాలు దొరకడం లేదు. అలాంటిది బ్రూస్ లీ, మిస్టర్ వంటి డిజాస్టర్లు ఇచ్చిన శ్రీను వైట్లకు మరో సినిమానా?

ఇలాంటి గ్యాసిప్ ఒకటి పుట్టించారు. పైగా మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది అంటూ. ఇప్పటికే మైత్రీ మూవీస్ సుకుమార్-రామ్ చరణ్ సినిమాలో తలమునకలై వుంది. వచ్చేనెల నాగ్ చైతన్య-చందు మొండేటి సినిమా స్టార్ట్ చేయాలి. అందువల్ల శ్రీను వైట్లతో సినిమా అంటే అనుమానమే కదా? పైగా రవితేజ హీరోగా అని మరో గ్యాసిప్.

శ్రీనువైట్ల స్క్రిప్ట్ తయారీలో వున్నారన్నది వాస్తవం. ఏదైనా సినిమా తెరకెక్కితే, మిస్టర్ ఒప్పందం ప్రకారం ఆ సినిమా నిర్మాతలకు ఆయన బకాయిలు చెల్లించాల్సి వుంది. 

లేదూ అంటే వాళ్లే ధైర్యం చేసి మళ్లీ శ్రీనువైట్లతో సినిమా తీయాలి. ఒకప్పుడు మైత్రీ వాళ్లు శ్రీను వైట్లకు అడ్వాన్స్ ఇచ్చి వుంటే వుండొచ్చు కానీ, వాళ్ల సినిమాల జాబితాలో మాత్రం శ్రీనువైట్ల సినిమా లేదన్నది పక్కా వాస్తవం.

ఏమైనా మిస్టర్ ను మరిచిపోవడానికి కొన్నాళ్లు పడుతుంది. అప్పుడు కానీ శ్రీను వైట్ల మళ్లీ టేక్, కట్, ఓకె అని చెప్పే అవకాశం రాకపోవచ్చు.