Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

శ్రీరస్తు వచ్చె...మొదలాడు

శ్రీరస్తు వచ్చె...మొదలాడు

రెడ్డిగారు వచ్చాక, హరి కథయినా, బుర్రకథయినా మళ్లీ మొదట్నించీ చెప్పమన్నారని వెనకటికి సామెత. అల్లు శిరీష్ సినిమా వ్యవహారం ఇలాగే వుంది. శ్రీరస్తు శుభమస్తు విడుదలకు ముందే, చిన్న ప్రొడ్యూసర్లు కొందరు కలిసి శిరీష్ తో సినిమా తీయడానికి ముందుకు వచ్చారు. మల్లిడి వేణు దర్శకుడు. శిరీష్ కు బయటి ప్రొడ్యూసర్ల ఆఫర్ రావడమే సూపరెహె..అనేసి ఓకె చేసేసారు. ముహుర్తం జరిగిపోయింది. 

ఇప్పుడేమయింది. శ్రీరస్తు శుభమస్తు హిట్ అయింది. శిరీష్ కు, అరవింద్ గారికి ఓ కాన్ఫిడెన్స్ వచ్చింది. దీంతో అంతకు ముందు వాళ్లేదో చేసుకుంటారు అని వదిలేసిన అల్లు అరవింద్, ఇప్పుడు మల్లిడి వేణు సినిమా స్క్రిప్ట్ మీద దృష్టి పెట్టారని వినికిడి. వేణును పిలిపించి, ' రా బాబూ..ఏంటీ కథ..స్క్రిప్ట్ ఏంటీ..'అంటూ చెక్కుళ్లు, దిద్దుళ్లు మొదలెట్టారని తెలుస్తోంది. 

అరవింద్ గారి జాగ్రత్తలు మామూలుగా వుండవు. బన్నీ సినిమా కోసం బోయపాటిని, హరీష్ శంకర్ నే పిండేసి వదిలారు. అలాంటది కొత్త దర్శకుడు వేణును మాత్రం వదుల్తారా? పిండి రసం తీసి, చిక్కదనం సరిపోయేవరకు, ఇంకా ఇంకా పిండుతూనే వుంటారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?