హీరోయిన్గా కెరీర్ ప్రారంభంలోనే బికినీతో హల్చల్ చేసింది శృతిహాసన్. విలక్షణ నటుడు కమల్‌హాసన్ కుమార్తె అయినా, గ్లామర్‌లో శృతిహాసన్ ఎక్కడా రాజీ పడలేదు. బాలీవుడ్లో నటించిన తొలి చిత్రం 'లక్' నుంచి ఇప్పటిదాకా.. ఏ సినిమాలో నటించినాసరే, కాస్తో కూస్తో గ్లామర్ పండించి తీరాల్సిందే. ఓవర్ డోస్ ఎక్స్పోజింగ్ అనే 'రెడ్‌లైన్'ని కూడా శృతిహాసన్ ఎప్పుడో దాటేసింది.
అన్నట్లు, 'ఎవడు' సినిమాలో ఓ సాంగ్‌లో శృతిహాసన్ రెచ్చిపోయి అందాల విందు చేయడం, ఆ తర్వాత ఆ టైమ్‌లో తీసిన కొన్ని ఫొటోలు కాస్తా, తన ఇమేజ్‌ని డ్యామేజ్ చేయడంతో, శృతిహాసన్ గుస్సా అవడం తెల్సిన విషయాలే. తనకు తెలియకుండా ఆ ఫొటోల్ని బయటకు తీసుకొచ్చారంటూ వాపోయింది శృతిహాసన్. ఆ ఒక్క సందర్భం మినహా, శృతిహాసన్ ఎక్స్పోజింగ్ విషయంలో ఎప్పుడూ తగ్గిన దాఖలాల్లేవు.
ఎక్స్పోజింగ్ గురించి ఎప్పుడు ఎవరు ప్రశ్నించినా శృతిహాసన్‌ది ఒకటే మాట. 'అందం చూడవయా.. ఆనందించవయా..' అని. 'సినిమాకి ఎంత అవసరమో అంత గ్లామర్ తప్పనిసరి.. అయినా నా లిమిట్స్ ఏంటో నాకు తెలుసు..' అని చెబుతుంది శృతిహాసన్. తాజాగా, శృతిహాసన్‌ని ఇదే విషయమై అడిగితే, 'నాన్సెన్స్.. ఎక్స్పోజింగ్ అనేది అసలు టాపిక్కే కాదు..' అని కసురుకునేసరికి, ప్రశ్న అడిగిన వ్యక్తికి షాక్ తగిలేసిందట. దటీజ్ శృతిహాసన్.