టైటిల్ చిరంజీవిదే కావొచ్చు. అలా అని యావరేజ్ సినిమా టైటిల్ పెట్టరు కదా. కానీ ఈసారి అలాంటి ప్రయత్నాలే జరుగుతున్నట్టు టాక్. అవును.. రామ్ చరణ్ కొత్త మూవీకి చిరంజీవి పాత సినిమా టైటిల్ పెట్టాలనుకుంటున్నారు. అదే స్టేట్ రౌడీ. చిరంజీవి కెరీర్ లో ఇదేమంత సూపర్ హిట్ సినిమా కాదు. జస్ట్ యావరేజ్ మూవీ అంతే.
ఇలాంటి సినిమా టైటిల్ ను చరణ్-బోయపాటి మూవీకి పెడతారంటూ నిన్నట్నుంచి సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. దసరాకు చెర్రీ కొత్త సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారు. అదే రోజున ఫస్ట్ లుక్ తో పాటు ఈ టైటిల్ ను కూడా ఎనౌన్స్ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ప్రస్తుతం యూనిట్ అజర్ బైజాన్ లో ఉంది. అక్కడ చరణ్ పై ఓ యాక్షన్ ఎపిసోడ్ తీస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ షెడ్యూల్ ముగుస్తుంది. యూనిట్ హైదరాబాద్ తిరిగొచ్చిన వెంటనే టైటిల్ పై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చిరంజీవి నటించిన 150 సినిమాల్లో మాస్ టైటిల్స్ చాలానే ఉన్నాయి.
కానీ ఏరికోరి ఈ టైటిల్ నే ఎందుకు సెలక్ట్ చేసుకున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. మరోవైపు ఇలా పాత టైటిల్స్ ను రిపీట్ చేయడానికి దర్శకుడు బోయపాటి శ్రీను వ్యతిరేకం. అయినప్పటికీ ఈ స్టేట్ రౌడీ అనే టైటిల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.