దిల్ రాజు ఓ మీడియం రేంజ్ సినిమాకు చేస్తున్న హంగామా ఇంతా అంతా కాదు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాకు అటు ఓవర్ సీస్ లోనూ, ఇటు డొమస్టిక్ మార్కెట్ లోనూ బాగానే హైప్ తెచ్చారు.
ఎప్పుడూ లేనిది ఎవడు తరువాత దిల్ రాజు పబ్లిసిటీకి బాగా ఖర్చు చేసారట. దాని ఫలితమే ఈ హైప్. ఓవర్ సీస్ లో భారీగా ప్రీమియర్ షోలు పడుతున్నాయి. అదే విధంగా మూడోసినిమాకే సాయి ధరమ్ తేజకు ఓ బెనిఫిట్ షో ఈ సినిమాతో వచ్చేసింది. అయితే నామినల్ రేట్ గా వంద రూపాయిలకే ఈ బెనిఫిట్ షో ప్లాన్ చేయడంతో టికెట్ లు ఉఫ్ న ఎగిరిపోయాయి.
సాయి ధరమ్ కు కూడా బెనిఫిట్ షో పడిందని అనిపించాలనేది ఓ పైలట్ అయిడియాగా ఈ సినిమాతో అమలు చేస్తున్నారట. సినిమాకు ఇరవై కోట్ల వరకు అన్నీ కలుపుకుని, అంటే పబ్లిసిటీతో కలిపి, అయిందని అంటున్నారు. అయితే దిల్ రాజు ఇంత ఓ మీడియం సినిమా మీద ఖర్చు చేసి వుంటారా అన్నది అనుమానం.