ఎంతయినా టాలీవుడ్ లో హీరో హీరోనే. ఎంత సూపర్ డైరక్టర్ అయినా స్క్రిప్ట్ దగ్గరకు వచ్చేసరికి ఏదో చెప్పేసి మాయ చేస్తామంటే ఇప్పటి టాలీవుడ్ హీరోలు ఓకే అనడంలేదు. డైరక్టర్ సుకుమార్ కు ఇదే సమస్య అవుతోంది. మహేష్ బాబు దగ్గర స్క్రిప్ట్ ఓకే కాలేదు. అక్కడ పని జరగలేదని ఎన్టీఆర్ దగ్గరకు వెళ్తే సమస్యే లేదన్నాడు. దాంతో బన్నీ దగ్గరకు వెళ్లి సినిమా అనౌన్స్ అయిందనిపించుకున్నారు.
కానీ సమస్య ఏమిటంటే, అక్కడా బౌండ్ స్క్రిప్ట్ ఇవ్వాల్సిందే. అదే అసలు సిసలు సమస్య. ఇదిలావుంటే డైరక్షన్ వ్యవహారాలు పక్కనపెట్టి, తన శిష్యుల డైరక్షన్ లో సినిమాల నిర్మాణానికి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. కానీ అవన్నీ ఒక్కొక్కటీ ఏదో కారణం వల్ల ఆగిపోతున్నాయి.
అన్నింటిలోకీ నితిన్-సూర్య ప్రతాప్ సినిమా వ్యవహారం మరీ చిత్రమని తెలుస్తోంది. ఈ సినిమాకు లైన్, కథ కాదు, బౌండ్ స్క్రిప్ట్ కావాలని హీరో నితిన్ పట్టుపట్టాడట. ఎప్పటికీ అదేమాట మీద వున్నాడట. దాంతో సుకుమార్ 'హీరోని వచ్చి కొబ్బరికాయ కొట్టి, సినిమా పక్కా చేయమను, అప్పుడు బౌండ్ స్క్రిప్ ఇద్దాం' అనే అర్థం వచ్చేలా కబురు చేసాడని టాలీవుడ్ లో వినిపిస్తోంది.
దాంతో హర్ట్ అయిన హీరో నితిన్, 'ఈ కండిషన్లేంటీ.. సమస్య లేదు, సినిమా చేసేదిలేదు' అని తెగేసి చెప్పడట. అంతేకాదు, మరో ప్రాజెక్టు ను ఫైనల్ చేసేసుకున్నాడట. సోప్పుడు సుకుమార్ కు తెలిసి వచ్చి వుండాలి. మహేష్ బాబే కాదు, నితిన్ నే కాదు మరే బాబు అయినా స్క్రిప్ట్ చూపించకుండా సినిమాలు చేసే పరిస్థితి ఇప్పుడు లేదు. అరచేతిలో స్క్రిప్ట్ చూపించి, సినిమా మొత్తం అలాగే ఫినిష్ చేస్తామనంటే నమ్మే రోజులు పోయాయి.