రంగస్థలం సినిమాతో టాప్ డైరక్టర్ గా ఫిక్సయిపోయాడు సుకుమార్. అంతకు ముందు చేసిన తప్పులు చెల్లిపోయాయి. మహేష్ బాబుతో సినిమా ఫిక్సయింది. మహేష్ విదేశాలకు వెళ్లడానికి ముందే సుకుమార్ సూత్ర ప్రాయంగా లైన్ చెప్పాడట. ఇప్పుడు మహేష్ విదేశాల నుంచి వచ్చేసరికి దాన్ని డెవలప్ చేసి వుంచాడట.
అయితే మహేష్-సుకుమార్ సినిమాకు కనీసం ఏడెమిదినెలల టైమ్ వుంది. కానీ సుకుమార్ కూడా స్క్రిప్ట్ తయారీకి ఆరేడు నెలలు టైమ్ తీసుకుంటాడు. అందుకే మహేష్ మళ్లీ సినిమాలో బిజీ అయిపోయేలోగా, తాను డెవలప్ చేసిన కథ వినిపించేందుకు సుకుమార్ సిద్దం అయిపోయినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ విషయం మహేష్ కు తెలియచేసినట్లు, ఆయన వంశీ పైడిపల్లి సినిమా స్టార్ట్ చేసే లోగానే కథ వినేసేందుకు ఓకె అన్నట్లు తెలుస్తోంది. అంటే ఇప్పుడు కనుక మహేష్ కథ వినేసి, ఓకె అనేసినా, కాస్త మార్పులు చేర్పులు చెప్పినా, ఇక సుకుమార్ ఆ పనిమీద వుంటారు. వంశీ పైడిపల్లి సినిమా పూర్తయ్యేసరికి, సుకుమార్ బౌండ్ స్క్రిప్ట్ తో, ప్రీ రీలీజ్ వర్క్ తో రెడీ అయిపోతారన్నమాట.