ఆర్యతో తెలుగు చిత్రసీమకు ఓ సరికొత్త ప్రేమ ఫార్ములా పరిచయం చేశాడు సుకుమార్. ఆ సినిమాకి సీక్వెల్‌గా ఆర్య2 తీశాడు. పేరులో, కథానాయకుడి పాత్ర చిత్రణలో తప్ప ఆర్యకీ ఆర్య2కీ ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు వన్‌కీ సీక్వెల్ ఆలోచిస్తున్నాడు సుకుమార్. ఒకవేళ వన్‌కి సీక్వెల్ తీయాల్సివస్తే దానికి 1+1 అనే పేరు పెడతా అని చెబుతున్నాడు.
అయితే ఇది కేవలం ఓ ఆలోచన మాత్రమే అని.. ఇప్పటి వరకూ అలాంటి ప్రతిపాదన ఏమీ లేదని సుకుమార్ చెబుతున్నాడు. 1 విడుదలైన తరవాత మహేష్ తనకు ఫోన్ చేసి నైతిక ధైర్యం అందించాడట. ఒక్క రోజు ఆగు.. నెగిటీవ్ టాక్ కాస్త, పాజిటీవ్ టాక్‌గా మారిపోతుంది అని భరోసా ఇచ్చాడట.
ఆ తరవాత మహేష్ చెప్పినట్టే జరిగిందని సుక్కు సంతోషపడిపోతున్నాడు. మహేష్ మరో సినిమా చేద్దాం అని మాట కూడా ఇచ్చాడని, ఈసారి మహేష్ తో సినిమా చేస్తే ఓ ప్రేమకథ తెరకెక్కిస్తానంటున్నాడు సుకుమార్. మరి సుక్కు ఆశలు ఫలిస్తాయంటారా?