సుకుమార్‌ మరీ ఓవర్‌ చేస్తున్నాడట

అత్తారింటికి దారేది చిత్ర పరిశ్రమల్లో కొత్త ఆశలు చివురింపజేసింది. బడ్జెట్‌ ఎంతైనా పెట్టుకోవచ్చు – డబ్బులు తిరిగొచ్చేస్తాయ్‌ అన్న ధీమా ఇచ్చింది. టాప్‌ స్టార్‌ సినిమా.. సూపర్‌ హిట్టయితే వంద కోట్లు వచ్చేస్తాయ్‌ అనే…

అత్తారింటికి దారేది చిత్ర పరిశ్రమల్లో కొత్త ఆశలు చివురింపజేసింది. బడ్జెట్‌ ఎంతైనా పెట్టుకోవచ్చు – డబ్బులు తిరిగొచ్చేస్తాయ్‌ అన్న ధీమా ఇచ్చింది. టాప్‌ స్టార్‌ సినిమా.. సూపర్‌ హిట్టయితే వంద కోట్లు వచ్చేస్తాయ్‌ అనే ధీమా ఇచ్చింది. అందుకే ఇప్పుడు తెలుగు సినిమాల బడ్జెట్‌ కూడా పెరుగుతోంది. నిన్నా మొన్నటి వరకూ స్టార్‌ హీరో సినిమా అంటే రూ.30 నుంచి రూ.40 కోట్ల రూపాయల లోపే. మగధీర వచ్చి దాన్ని రూ45 కోట్లకు చేర్చింది. విజువల్‌ ఎఫెక్స్‌ సినిమాకి ఆ మాత్రం ఖర్చు చేయొచ్చనిపించింది. 

ఆ తరవాత ప్రతీ సినిమా రూ.50 కోట్లు తగ్గడం లేదు. అత్తారింటికి దారేది సినిమాకి రూ.60 కోట్లు ఖర్చు అయ్యిందట. ఆ సినిమాకి బాగా డబ్బులొస్తున్నాయి కాబట్టి, ఇప్పుడు రాబోయే సినిమాలు కూడా పెట్టుబడి పెంచేసుకొంటున్నాయి. మహేష్‌బాబు సినిమా '1'కి రూ.70 కోట్ల బడ్జెట్‌ అయినట్టు టాక్‌!  అదే నిజమైతే తెలుగులో రూ.70 కోట్ల వ్యయంతో నిర్మించిన తొలి సినిమా ఇదే అవుతుంది. (బాహుబలి వంద కోట్లు కావచ్చు, కానీ ముందు విడుదలయ్యేది '1' సినిమానే కాబట్టి..). 

సినిమా బాగుంటే వంద కోట్లు ఈజీగా వసూలు చేయొచ్చనే ధీమాతోనే సుకుమార్‌ ఈ రేంజులో ఖర్చు పెట్టిస్తున్నాడట. 14 రీల్స్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ సంస్థ కూడా మహేష్‌ స్టామినానీ, మార్కెట్‌నీ దృష్టిలో ఉంచుకొని.. ఈ సినిమాకి బాగా రిచ్‌గా తీశారు. మొత్తానికి '1' సినిమా బడ్జెట్‌లోనూ '1'గా నిలిచిందన్నమాట.