సుమంత్.. గెటప్ లు బోలెడంట

అక్కినేని గెటప్ లో మనవడు సుమంత్ గెటప్ స్టిల్స్ బయటకు రాగానే తెగ ప్రశంసలు వచ్చాయి. ఈ స్టిల్స్ లో సుమంత్ కాస్త నడివయసు గెటప్ లో, అది కూడా అక్కినేని నాచురల్ స్టయిల్…

అక్కినేని గెటప్ లో మనవడు సుమంత్ గెటప్ స్టిల్స్ బయటకు రాగానే తెగ ప్రశంసలు వచ్చాయి. ఈ స్టిల్స్ లో సుమంత్ కాస్త నడివయసు గెటప్ లో, అది కూడా అక్కినేని నాచురల్ స్టయిల్ లో కనిపించాడు. మహానటి సినిమాలో ఇదే అక్కినేని యంగ్ గెటప్ లో కనిపించాడు మరో మనవడు నాగచైతన్య. అయితే చైతూ జస్ట్ ఎట్ ఎ గ్లాన్స్ అన్నట్లుగా అలా మెరిసి మాయమయ్యాడు ఆ సినిమాలో.

కానీ సుమంత్ వ్యవహారం అలా కాదట. ఎన్టీఆర్ బయోపిక్ లో ఎఎన్నార్ పాత్ర స్పాన్ ఎక్కువే వుంటుందని సుమంత్ నే స్వయంగా వెల్లడించాడు ఇప్పుడు. దాదాపు అయిదారు సినిమాటిక్ గెటప్ ల్లో సుమంత్ కనిపిస్తాడట. పల్లెటూరి పిల్ల లగాయతు రకరకాల సినిమాల గెటప్ లు ప్లస్, నాచురల్ గెటప్ లో సుమంత్ దర్శనమిస్తాడట.

టోటల్ గా అన్ని గెటప్ లు కలిసి అయిదారు వుంటాయని వెల్లడించాడు. అంటే ఎన్టీఆర్-ఎఎన్నార్ కలిసిన సినిమాల్లో ఎంపిక చేసిన కొన్ని వుండే అవకాశం వుంది. మరి వీటిల్లో ప్రెస్టీజియస్ చాణక్య-చంద్రగుప్త వుంటుందో? వుండదో అన్నది మాత్రం తెలియాల్సి వుంది.

ఇదిలా వుంటే చంద్రబాబు క్యారెక్టర్ తో అక్కినేని క్యారెక్టర్ కలిసి వున్న సన్నివేశాలు కూడా సినిమాలో వున్నాయని సుమంత్ బయటపెట్టాడు. ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం టైమ్ లో చంద్రబాబు-అక్కినేని క్యారెక్టర్లు కలిసిన సీన్లు వుంటాయని వివరించాడు.

ఈ లెక్కన చూస్తుంటే ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబు క్యారెక్టర్ కూడా కాస్త ఎక్కువ లెంగ్తీగానే వుండేలా కనిపిస్తోంది.