శతమానం భవతి సినిమా హిట్ తో హ్యాపీగా వున్న హీరో శర్వానంద్ తన తరువాతి సినిమాను కూడా చకచకా ఫినిష్ చేసేస్తున్నాడు. బివివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించే ఈ సినిమాకు చంద్రమోహన్ దర్శకుడు. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సివుంది.
కానీ శతమానం భవతి హిట్ తరువాత శర్వానంద్ చాలా కేర్ తీసుకోవడంతో మరి కాస్త ఆలస్యం అయింది. శర్వా స్వయంగా చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయించినట్లు తెలుస్తోంది. దీంతో డిలే తప్పలేదు. ఈ సినిమా ఆలస్యం కావడంతో మారుతి-యువి కాంబినేషన్ సినిమా కూడా లేటయింది. ఆఖరికి ఒక పాట మినహా మిగిలినదంతా పూర్తి చేసారు.
ఆ పని పక్కన వుంచి రెండు రోజుల్లో మారుతి సినిమా మీదకు వెళ్లిపోతున్నాడు శర్వా. అయితే కాస్త గ్యాప్ లో ఆ పాట కూడా ఫినిష్ చేసి, మార్చి ఎండ్ లేదా ఏప్రియల్ ఫస్ట్ వీక్ లో ఆ సినిమాను విడుదల చేసే ప్రయత్నంలో వున్నాడు. అంటే సంక్రాంతి బరిలో హిట్ కొట్టి సమ్మర్ ను కూడా టార్గెట్ చేస్తున్నట్లున్నాడు శర్వా.