సన్నీలియోన్.. పరిచయం అక్కర్లేని పేరిది. భారతదేశంలో చాలా స్మార్ట్ ఫోన్లలో సన్నీలియోన్ నటించిన చాలా సినిమాల్లోని వీడియోలుంటాయి. అంతెందుకు, ఆమె నటించిన అడల్ట్ సినిమాలూ స్మార్ట్ ఫోన్లలో నిక్షిప్తమయిపోతూనే వున్నాయి. ఆమెకున్న క్రేజ్ అలాంటిది.
‘పెద్దలకు మాత్రమే’ సినిమాల్లో నటించి, కాస్త అలాంటివే అయిన బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ, క్రేజ్ మరింత పెంచుకుంటోన్న సన్నీలియోన్‌పై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సన్నీలియోన్ పేరుతో ఇంటర్నెట్ నిండా అసభ్యతే వుంటోందని అంజలి అనే మహిళ, థానేలో ఫిర్యాదు చేయడంతో, పోలీసులు ఆమె ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేశారు.
ఐపీసీ సెక్షన్లతోపాటు, ఐటీ చట్టానికి సంబంధించిన సెక్షన్లనూ ఇందుకోసం వినియోగించారు. అయితే సన్నీలియోన్ బ్యాక్‌గ్రౌండ్ అందరికీ తెల్సిందే. దాన్ని మార్చడానికి వీల్లేని పరిస్థితి. ఇంటర్నెట్‌లో ఆమె తన సొంత వెబ్‌సైట్ నడుపుతోంది. అందులో అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలూ కోకొల్లలు. ఇంటర్నెట్‌లో ఎలాంటి సమాచారం వున్నా, దాన్ని అడ్డుకోవడానికి కొన్ని ఇబ్బందులూ వున్నాయి మన చట్టాల్లో.
బూతు సినిమాల్లో నటించిన సన్నీలియోన్ గత చరిత్రను చెరిపేయడం వీలు పడకపోవచ్చు. ఇక, కేసులంటారా.. ఇవి ఆమెకు కొత్త కాదు. జస్ట్ పబ్లిసిటీ పరంగా ఆమెకు ఉపయోగపడ్తాయేమో.!