ఆమె.. ఒక్క ట్రాక్ కు డాన్స్, దక్కేది రూ.నాలుగు కోట్లు!

80లలో సూపర్ హిట్ సాంగ్ “లైల ఓ లైలా..’’. ఖుర్బానీ సినిమాలోని ఈ సాంగ్ ను షారూక్ ఖాన్ తాజా సినిమా ‘రయీస్’ లో రీమిక్స్ చేశారు. విశేషం ఏమిటంటే.. ఆ పాటకు సన్నీ…

80లలో సూపర్ హిట్ సాంగ్ “లైల ఓ లైలా..’’. ఖుర్బానీ సినిమాలోని ఈ సాంగ్ ను షారూక్ ఖాన్ తాజా సినిమా ‘రయీస్’ లో రీమిక్స్ చేశారు. విశేషం ఏమిటంటే.. ఆ పాటకు సన్నీ లియోన్ నర్తించడం! ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ లో సన్నీని కూడా ఒక సెకను పాటు చూపించారు!

అదే ఇప్పుడు.. సన్నీలియోన్ కు బీభత్సమైన క్రేజ్ తెచ్చి పెడుతోంది. ఇంత వరకూ ఈమెకు క్రేజ్ లేదని కాదు కానీ, సూపర్ హిట్టై, లక్షల వ్యూస్ ను పొందిన ‘రయీస్’ సినిమా ట్రైలర్ సన్నీకి ఇప్పుడు మంచి మంచి ఆఫర్లను తెచ్చి పెడుతోంది. ఈ ట్రైలర్ లో సన్నీని చూసి.. ఒక స్టార్ హోటల్ వారికి కొత్త ఐడియా వచ్చిందట.

డిసెంబర్ 31  రాత్రిన.. సన్నీతో ‘లైల ఓ లైలా..’ ట్రాక్ కు లైవ్ ఫెర్మార్మెన్స్ ఇప్పించాలని ఫిక్సయ్యారు ముంబైలోని ఆ హోటల్ వారు. రీమిక్స్ సాంగ్ ఇంకా అందుబాటులో లేదు, దీంతో పాత పాటకే డాన్సు చేయిస్తారట. దీనికి గానూ సన్నీకి భారీ ఆమోంట్ ను ఆఫర్ చేశారు. ఆ మొత్తం.. ఏకంగా నాలుగు కోట్ల రూపాయలు! 

ఐదంటే.. ఐదు నిమిషాలు.. ఆ ఒక్క పాటకే లైవ్ ఫెర్ఫార్మెన్స్.. సన్నీ లియోన్.. నాలుగు కోట్లు! ఇదీ లెక్క. సన్నీకి  డిసెంబర్ 31 నైట్ చాలా ఒప్పందాలున్నాయి. ఇలాంటి స్టార్ హోటళ్లు, ఖరీదైన పబ్బులు.. ఆమె అడుగు పెడితే చాలు కోట్ల రూపాయలు అప్పజెప్పడానికి రెడీగా ఉన్నాయి! ఇలాంటి ఒప్పందాల్లో.. ఈ ఐదు నిమిషాల ఒప్పందం కూడా ఒకటి అని తెలుస్తోంది. సన్నీనా.. మజాకా!