చిరంజీవి హీరోగా ఓ సినిమా తెరకెక్కించనున్నట్లు 'ధృవ' ప్రమోషన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూల్లో సురేందర్‌రెడ్డి ప్రకటించిన విషయం విదితమే. అయితే, 'ధృవ' రిజల్ట్ తర్వాతే ఈ వ్యవహారంపై ఓ క్లారిటీ వస్తుందని అంతా అనుకున్నారు. ఆ అనుకున్నదే నిజమయ్యింది. 'ధృవ' రిజల్ట్ తర్వాత చిరంజీవి, సూరితో సినిమా చేయాలని కన్ఫామ్ అయ్యారట.
ప్రస్తుతం 'ఖైదీ నెంబర్ 150' సినిమా పనుల్లో బిజీగా వున్న చిరంజీవి, ఈ సినిమా పూర్తి చేసిన వెంటనే, సూరి అలియాస్ సురేందర్‌రెడ్డితో చేయబోయే సినిమాపై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రకటన కూడా, 'ఖైదీ నెంబర్ 150' సినిమా ఆడియో విడుదల వేడుకలోనే వుంటుందన్న గుసగుసలు విన్పిస్తున్నాయి. 'ధృవ' సినిమా ఓవర్సీస్లో మంచి వసూళ్ళు సాధించడంతో, చిరంజీవి దృష్టి ఈజీగానే సురేందర్‌రెడ్డి వైపు మళ్ళిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.
మరోపక్క, చిరంజీవితో కన్ఫామ్ చేసుకున్నాకే సురేందర్‌రెడ్డి – చిరంజీవితో సినిమాపై క్లారిటీ ఇచ్చాడన్న ప్రచారమూ జరుగుతోంది. ఇదిలా వుంటే, 'ధృవ' టైమ్‌లోనే సురేందర్‌రెడ్డితో మరో సినిమాకి అల్లు అరవింద్ ఒప్పందం కుదుర్చుకున్నారనీ, గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే చిరంజీవి – సూరి సినిమా వుంటుందనీ మరో గాసిప్ తెరపైకి వచ్చింది.
ఏమో, చిరంజీవితో సినిమాపై సూరి ఇంకోసారి క్లారిటీ ఎప్పుడిస్తాడోగానీ, సూరి కోసం చాలామంది హీరోలు వెయిటింగ్ లిస్ట్‌లో వున్నారు. గతంలో 'మాట'గా కొందరు హీరోలతో సూరి ఒప్పందాలు కుదుర్చుకున్న దరిమిలా, ఈ మొత్తం ఎపిసోడ్‌పై అటు చిరంజీవి, ఇటు సూరి పూర్తిస్థాయిలో క్లారిటీ ఇస్తేనేగానీ, సస్పెన్స్ వీడదు.