సూర్యకు బొబ్బిలి పులి ప్రేరణ?

రచయిత వక్కంతం వంశీ తెలివైన కథకుడు. రెండు మూడు కథలు కలిపి, కొత్తకథను తయారుచేయడంలో భలే సిద్దహస్తుడు. కిక్ తో సహా ఆయన కథలు అన్నీ కాస్త తెలివిగా అల్లుకున్నకథలే. Advertisement ఆ సంగతి…

రచయిత వక్కంతం వంశీ తెలివైన కథకుడు. రెండు మూడు కథలు కలిపి, కొత్తకథను తయారుచేయడంలో భలే సిద్దహస్తుడు. కిక్ తో సహా ఆయన కథలు అన్నీ కాస్త తెలివిగా అల్లుకున్నకథలే.

ఆ సంగతి అలా వుంచితే, తొలిసారి డైరక్టర్ గా మారుతూ బన్నీ తో అందిస్తున్న ‘సూర్య’ సినిమా కథ గురించి చిన్న చిన్న గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. ఈ ‘సూర్య’ అన్న టైటిల్ కు నా ఇల్లు ఇండియా అన్నది ట్యాగ్ లైన్.

ఈ సినిమా కథ గురించి వినిపిస్తున్న గ్యాసిప్ లు నిజమైతే, ఈకథ ఎన్టీఆర్ బొబ్బిలి పులి, రాజశేఖర్ ఆగ్రహం సినిమాల నుంచి ప్రభావితం అయిందేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

సూర్య అనే క్యారెక్టర్ కు విపరీతమైన ఆగ్రహం లేదా షార్ట్ టెంపర్. అన్యాయాన్ని అస్సలు సహించలేడు. అలాంటి వాడు మిలటరీలోకి వెళ్లాలంటే కోపం తగ్గించుకోవాలి. అలా తగ్గించుకున్నట్లు రూఢీ కావాలి.

ఇక్కడ చాలా విషయాలు వున్నాయి. అవి కూడా గతంలో నాగార్జున వజ్రం సినిమాను కాస్త గుర్తుకు తెస్తాయని ఇండస్ట్రీ వర్గాల గుసగుస. చివరకు, మిలటరీలో వుండి చేయవలసిన దాని కన్నా, దేశం లోపల వున్న అంత: శతృవులను అంతమొందిచడం అవసరం అన్నది పాయింట్.

బొబ్బిలిపులిలో మిలటరీ నుంచి వచ్చి అంత: శతృవులను ఏరేస్తాడు హీరో. ఇక్కడ మిలటరీలోకి ఎంట్రీ లేక, ఇక్కడే వుండి అంత: శతృవులను ఏరేస్తాడు అన్నమాట. నానా పటేకర్, రాజశేఖర్ లాంటి వాళ్లు ఈ యాంగ్రీ యంగ్ మాన్ క్యారెక్టర్లను అద్భుతంగా పోషించారు. బన్నీ ఎలా చేస్తాడో చూడాలి.