ఇప్పటిదాకా ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపించిన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఒక్కసారికి రూట్ మార్చేస్తున్నాడు. ఈనెల 9న డైరక్టర్ తేజ దర్శకత్వంలో స్టార్ట్ కాబోయే సినిమాలో ఫుల్ గా అమాయక చక్రవర్తిగా కనిపించబోతున్నాడు. స్వాతిముత్యంలో కమల్ హాసన్, చంటిలో వెంకటేష్ మాదిరిగా అమాయకంగా కనిపించే క్యారెక్టర్ తో తేజ కథ తయారుచేసాడు.
అయితే బెల్లంకొండ హీరో సినిమాలకు హిందీ డిజిటల్, శాటిలైట్ రేట్లు ఎక్కువ. అందుకోసం ఆ లైన్ ను కూడా కథలో మిక్స్ చేసారు. సినిమాలో సెకండాఫ్ లో, ఇంటర్వెల్ బ్యాంగ్ లో మాంచి ఫైట్లు సెట్ చేసారు. కానీ అసలు వ్యవహారం ఏమిటంటే, ఇప్పటిదాకా మాస్ హీరో అనిపించుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ మాంచి పెర్ ఫార్మర్ అనిపించుకోవడం లక్ష్యంగా పెట్టుకుని, ఈ స్క్రిప్ట్ ఓకె చేసుకున్నాడట.
తేజ మరి బెల్లంకొండను అంత అమాయకుడిగా ఎలా చూపించబోతున్నాడో? ఈ సినిమాతో విలన్ సోనూ సూద్ చాన్నాళ్ల తరువాత తెలుగు తెరపై కనిపించబోతున్నాడు. అలాగే కాజల్ మరోసారి తేజ సినిమాలో, వరుసగా బెల్లంకొండ సరసన నటించబోతోంది.