Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సైరా... రేట్ల పెంపు రెడీ

సైరా... రేట్ల పెంపు రెడీ

పెద్ద సినిమాలు వస్తున్నాయి అంటే చాలు రేట్ల పెంపు అన్నది అనివార్యంగా మారింది. అది ఏ హరో సినిమా అయినా? ఎవరి సినిమా అయినా. దీనికి ఓ సులువు సూత్రం కనిపెట్టారు. థియేటర్ల వారీ లెటర్లు రెడీ చేయడం, కోర్టుల ద్వారా ఆదేశాలు తెచ్చుకోవడం. ఏయే థియేటర్లలో ప్రదర్శిస్తామో ముందుగానే ఫిక్స్ చేసుకుంటే, హడావుడి లేకుండా స్మూత్ గా పని జరిగిపోతుంది.

బాహబలి ప్రభాస్ సాహో విషయంలో లాస్ట్ మినిట్ హడావుడి, లేనిపోని తకరారులు తప్పలేదు. కానీ సైరా విషయంలో అలా కాదు. పక్కాగా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు. అందుకే సినిమా విడుదల పదిరోజులు వుండగానే ఆంధ్రలో టికెట్ రేటుపెంపు కోసం కావాల్సిన వ్యవహారాలు అన్నీ పూర్తిచేసారు. రెండువందల యూనిఫామ్ రేటు ఫిక్స్ అయిపోయింది.

సైరా సినిమాను తెలుగు రాష్ట్రాల్లో 120 కోట్ల మేరకు బిజినెస్ చేసారు. సాహో మాదిరి కాదు. సాహో కేవలం ఈస్ట్ వెస్ట్ మినహా మరే ఏరియా తెలుగు రాష్ట్రాల్లో అమ్మలేదు. సైరా సినిమా తెలుగు రాష్ట్రాల్లో 130 కోట్లకు పైగా వసూళ్లు సాధించాలి. సాహో సినిమా 80 నుంచి 90 కోట్ల రేంజ్ లో వుండిపోయింది. మహేష్ బ్లాక్ బస్టర్ మహర్షి ది కూడా దాదాపు 80 కోట్ల రేంజ్ నే. మెగాస్టార్ ఆల్ రౌండర్ రికార్డు ఖైదీ నెంబర్ 150 కూడా తెలుగులో 80 కోట్ల రేంజ్ లోనే ఆగింది.

ఇలాంటి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో 130 కోట్ల మేరకు వసూళ్లు రావాలంటే సైరా ఫిగర్లు కచ్చితంగా బాహుబలి 2ని మ్యాచ్ కావాల్సిందే. వైజాగ్ ను పక్కనపెడితే మిగిలిన ఏరియాల్లో బాహుబలి 2 రేంజ్ కలెక్షన్లు తెచ్చుకోవాలి. మెగాస్టార్ కు వున్న క్రేజ్, అపరిమిత ఫ్యాన్ ఫాలోయింగ్, మాసివ్ ఓపెనింగ్ కలెక్షన్లు, దసరా సీజన్, సెలవులు అన్నీకలిసి సైరాను టార్గెట్ రీచ్ అయ్యేలా చేస్తాయని ట్రేడ్ వర్గాల బోగట్టా.

సైరా ట్రైలర్ క్రేజ్ ఏ రేంజ్ అంటే.. చూసి తీరాల్సిందే..!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?