Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సైరా కోసం భారీ జాతర

సైరా కోసం భారీ జాతర

ఆంధ్ర అంతటా ఇది జాతర్ల సీజన్. సంక్రాంతి తరువాత చాలా ప్రాంతాల్లో జాతర్ల కోలాహలం వుంటుంది. మెగాస్టార్ చిరంజీవి మెగా సినిమా సైరాలో కూడా జాతర హడావుడి మొదలవుతోంది. సైరా సినిమాలో ఓ జాతర పాట వుందట. ఈ సాంగ్ ను సినిమాకే హైలైట్ గా చిత్రీకరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

దాదాపు సినిమాలోని స్టార్ కాస్ట్ అంతా పాల్గొనే ఈ పాట కోసం భారీ జాతర సెట్ ను తయారు చేస్తున్నారు. రామోజీ ఫిలింసిటీ సమీపంలోని విశాలమైన ప్లేస్ లో ఓ భారీ సెట్ ను నిర్మిస్తున్నారు. కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఈ సెట్ లో షూటింగ్ ఈనెల 20 లేదా 21 నుంచి ప్రారంభమవుతుంది.

వినయ విధేయరామ సినిమా వ్యవహారం పూర్తయిపోవడంతో ఇప్పడు హీరో రామ్ చరణ్ సైరా మీద పూర్తి దృష్టిపెట్టారు. త్వరలో ఆర్ ఆర్ ఆర్ సెట్ మీదకు చరణ్ వెళ్లాల్సి వుంది. ఈలోగా సైరా ప్లానింగ్, ఇతరత్రా వ్యవహారాలు అన్నీ ఫైనల్ చేసే ఆలోచనలో చరణ్ వున్నట్లు తెలుస్తోంది.

కేసీఆర్, చంద్రబాబు ఫ్రంట్ గెలుపెవరిది? 

బాబు, జగన్ తేల్చాలేకపోతున్నారా..!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?