తారక్, చరణ్ లకు లాభాల్లో వాటా?

ఆర్ఆర్ఆర్.. ప్రస్తుతానికి ఇదే టైటిల్. డివివి దానయ్య నిర్మాతగా రాజమౌళి దర్శకత్వంలో తయారుకాబోయే సినిమాకు. వందలకోట్ల బడ్జెట్. దాదాపు ఏడాది పాటు చిత్రీకరణ. ఇలాంటి వార్తలు ఎన్నో వున్నాయి ఈ సినిమాకు సంబంధించి. వీటన్నింటికి…

ఆర్ఆర్ఆర్.. ప్రస్తుతానికి ఇదే టైటిల్. డివివి దానయ్య నిర్మాతగా రాజమౌళి దర్శకత్వంలో తయారుకాబోయే సినిమాకు. వందలకోట్ల బడ్జెట్. దాదాపు ఏడాది పాటు చిత్రీకరణ. ఇలాంటి వార్తలు ఎన్నో వున్నాయి ఈ సినిమాకు సంబంధించి. వీటన్నింటికి మించి అసలు ఎన్టీఆర్-రామ్ చరణ్ ల రెమ్యూనిరేషన్ ఎంత?

ఎందుకంటే ఈ సినిమాకు 200 రోజుల వంతున కాల్ షీట్ లు ఇస్తున్నారు ఆ ఇద్దరు హీరోలు. దాదాపు ఏడాదికి పైగా ఒకే సినిమాకు ఫిక్స్ అయిపోయి వుండాలి. ఇదే టైమ్ లో కనీసం రెండు మామూలు సినిమాలు చేసుకోవచ్చు.

ప్రస్తుతం తీసుకుంటున్న రెమ్యూనిరేషన్ ప్రకారం దాదాపు నలభై నుంచి యాభైకోట్ల ఆదాయం. మరి దీనికి బదులుగా ఆర్ఆర్ఆర్ నుంచి ఏం తీసుకుంటున్నట్లు? దర్శకుడు రాజమౌళి కూడా అంతే ఆయన కారణంగానే సినిమా వందల కోట్ల రేంజ్ కు చేరుకుంటుంది? మరి ఆయన ఏం తీసుకుంటున్నట్లు?

విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం ఈ సినిమాకు హీరోలు రామ్ చరణ్-ఎన్టీఆర్ ఇద్దరూ రెమ్యూనిరేషన్ తీసుకోవడం లేదు. అలాగే దర్శకుడు రాజమౌళి కూడా. ఈ ముగ్గురూ కూడా సినిమా లాభాల్లో వాటానే తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఆ లాభాలు ఏ మేరకు పంచుకుంటారు? వందల కోట్లు పెట్టుబఢి పెట్టే నిర్మాత దానయ్య వాటా ఎంత? సినిమాకు కర్త, కర్త, క్రియ లాంటి రాజమౌళి వాటా ఎంత? ఇవి మాత్రం ఇంకా ఆచూకీ అందడంలేదు. లాభాల్లో వాటానే అన్నది మాత్రం పక్కాగా తెలుస్తున్న విషయం.

కనీసం యాభై కోట్ల మేరకు వుండాలి ఒక్కో హీరో లాభం వాటా. అంటే మరి ఇద్దరు హీరోలకు వంద కోట్లు. మరి డైరక్టర్ కు? నిర్మాతకు? అంటే మొత్తగా ఆర్ఆర్ఆర్ నుంచి ఎంత లాభం ఆశిస్తున్నట్లు? ఈ అంకెలు అన్నీ కాస్త భారీగానే వుండే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి