Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

తమన్నాకు ఈ సారైనా కలిసొస్తుందా..?!

తమన్నాకు ఈ సారైనా కలిసొస్తుందా..?!

ఎప్పుడో తన బాలీవుడ్ డ్రీమ్స్‌ను బయటపెట్టేసుకొంది తమన్నా. తెలుగులో మంచి అవకాశాలు ఉన్న రోజుల్లోనే ఆమె ఒకటీ అర బాలీవుడ్ అవకాశాలేక ఎగిరిపడింది. తను ఉత్తరాది అమ్మాయినే.. అంటూ ముంబైలో చెప్పుకొంది. ఏదో కాలం కర్మం కలిసిరాక దక్షిణాదిలో సినిమాలు చేస్తున్నాను, నాకు మీరు అవకాశాలు ప్రోత్సహిస్తే ముంబైలోనే సెటిలయిపోతా.. అన్నట్టుగా తమన్నా మాట్లాడింది. అయితే ఈమె బాలీవుడ్‌లో చేసిన సినిమాలు డిజాస్టర్లుగా మిగిలిపోయాయి.

అజయ్ దేవగణ్‌తో చేసిన ‘హిమ్మత్ వాలా’ ఆ తర్వాత చేసిన ‘హమ్ షకల్స్’ సినిమాలు భారీ అంచనాలతో వచ్చి.. అత్యంత దారుణమైన ఫలితాలు ఎదుర్కొన్న సినిమాలుగా మిగిలిపోయాయి. ఇలాంటి నేపథ్యంలో తమన్నా తిరిగి తెలుగు, తమిళ భాషల్లోనే సర్దుకు పోయింది. ఇక్కడ వచ్చిన అవకాశాలను ఉపయోగించుకొంటూ ఒక్కొక్క సినిమా చేసుకొంటూ కొనసాగుతోంది. ఒక బాహుబలి సినిమాలో అవకాశం రావడం, అది కాస్తా సంచలన విజయం సాధించడం ఆ తర్వాత బెంగాల్ టైగర్, ఊపిరి సినిమాలు కూడా హిట్స్ అనిపించుకోవడంతో తమన్నాకు మళ్లీ జోష్ వచ్చింది. దీంతో పాటు ఒక హిందీ సినిమా అవకాశం కూడా వచ్చింది.

రోహిత్ షెట్టి దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో తమ్మూకు ఛాన్స్ వచ్చింది. మరి మిల్కీబ్యూటీ మరోసారి బాలీవుడ్ ప్రయత్నం చేస్తున్నట్టవుతోంది. తన డ్రీమ్ ల్యాండ్‌లో అడుగు పెట్టడానికి ఈ ట్రయల్ వేస్తోంది. మరి మొదటిరెండు ప్రయత్నాలూ దారుణమైన డిజాస్టర్లుగా మిగిలినా.. దక్షిణాదిలో ఈమెకు ఉన్న ఊపును చూసి హిందీలో అవకాశం ఇచ్చినట్టుగా ఉన్నారు. మరి ఈ సినిమా అయినా తమన్నాకు బాలీవుడ్‌లో గుర్తింపును ప్రసాదిస్తుందా? మరిన్ని అవకాశాలను ఇప్పించి.. అక్కడే సెటిలయ్యేలా చేస్తుందా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?