కాస్త ఆలస్యంగా వినిపిస్తోందీ వార్త టాలీవుడ్ లో. హీరోయిన్ తమన్నా కు ఎఫ్ 3 యూనిట్ కు మధ్య గట్టి గొడవ జరిగిందని. తమన్నా విషయంలో అందరికీ తెలిసిన కంప్లయింట్ ఒకటి వుంది. ఆమె డేట్ లు కేటాయించడం. షూటింగ్ కు రావడం వంటి విషయాల్లో అంత స్పష్టత వుండదని, బాగా డిలే అవుతూ వుంటుందని వినిపిస్తూనే వుంటుంది.
ఇలాంటి విషయంలోనే ఎఫ్ 3 సెట్ లో కొన్ని వారాల క్రితం చిన్న గడబిడ అయిందని బోగట్టా. అది చినికి చినికి గాలివానగా మారి, నిర్మాత దిల్ రాజు యూనిట్ కు తమన్నాకు మధ్య వివాదం బిగుసుకుపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అదృష్టం కొద్దీ సినిమా వర్క్ పూర్తయిపోయింది.
కానీ టోటల్ టీమ్ తో ఒక ప్రమోషనల్ సాంగ్ ప్లానింగ్ వుంది. అది అన్నపూర్ణలో షూట్ చేయాల్సి వుంది. మరి తమన్నా ఈ సాంగ్ కు హాజరవుతుందో లేదో అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. అంతే కాదు, ఈ పాటను పక్కన పెట్టి, వేరే ప్రత్యేక గీతం ప్లాన్ చేస్తున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
త్వరలో ఎఫ్ 3 సినిమా విడుదల వుంది. ఆ సినిమా ప్రమోషన్ టైమ్ లో తమన్నా వస్తే ఈ వ్యవహారం మీద క్లారిటీ అడగొచ్చు. లేదూ అలా ప్రమోషన్ కు రాకపోయినా క్లారిటీ వచ్చేసినట్లే. ఈలోగా యూనిట్ ను కాంట్రాక్ట్ చేస్తే, అబ్బే..అంతేం లేదు అంటూ సమాధానం వచ్చింది.