తనికెళ్ల మళ్లీ డైరక్షన్ ?

థియేటర్ నుంచి వచ్చిన మంచి రచయిత, నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి. అయితే మిథునం సినిమా తరువాత మళ్లీ మెగా ఫోన్ పట్టుకోలేదు. Advertisement భక్త కన్నప్ప సినిమా డైరక్ట్ చేయాలని కోరిక. కానీ…

థియేటర్ నుంచి వచ్చిన మంచి రచయిత, నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి. అయితే మిథునం సినిమా తరువాత మళ్లీ మెగా ఫోన్ పట్టుకోలేదు.

భక్త కన్నప్ప సినిమా డైరక్ట్ చేయాలని కోరిక. కానీ దాన్నివదిలేసారు. లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే భరణి మళ్లీ ఓ సినిమా డైరక్ట్ చేయబోతున్నారని.

చాలా కాలం కిందట తీసిన పెళ్లిసందడి టైటిల్ లో చిన్న మార్పు చేసి పెళ్లిసందD అంటూ మళ్లీ సినిమా చేయబోతున్నారు దర్శకుడు రాఘవేంద్రరావు. ఈ సినిమాకు ఆయన ఓవర్ ఆల్ సూపర్ విజన్ మాత్రమే చేస్తారు. డైరక్షన్ ఎవరో ఒకరికి ఇవ్వాలి. అందుకే ఆయన దృష్టి భరణి మీద వుందని తెలుస్తోంది.

భరణి ఇటు ఎమోషన్ ను అటు ఎంటర్ టైన్ మెంట్ ను సమానంగా పండించగలరు. అందుకే ఈ పెళ్లిసందD సినిమాను భరణ్ డైరక్ట్ చేసే అవకాశాలు వున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

పాత పెళ్లి సందడిలో హీరో శ్రీకాంత్ అయితే ఈ కొత్త దాంట్లో ఆయన కొడుకు హీరోగా నటిస్తాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జోరుగా సాగుతోంది.

గ్రేటర్ గెలుపు ఎవరిది