నటి అక్షర హాసన్ హాటో ఫొటోస్ లీక్ వ్యవహారంపై పోలీసులు విచారణ కొనసాగుతూ ఉంది. మరోవైపు మీడియా కూడా దీనిపై తనదైన విచారణ జరుపుతూ ఉంది. ఈ వ్యవహారంలో ఇప్పుడు మీడియా కొన్ని కొత్త పేర్లను వెలుగులోకి తీసుకొస్తూ ఉండటం విశేషం. లీకైన ఫొటోలను బట్టి చూస్తే వాటిని అక్షర తనకు బాగా కావాల్సిన వారి కోసం షేర్ చేసినట్టుగా స్పష్టం అవుతోంది. యుక్త వయసులోని అమ్మాయిలు, అబ్బాయిలకు ఈ రోజుల్లో ఇలాంటివి కామన్ కావొచ్చు.
ప్రేమలో ముదిరిపోయిన వారు ఇలాంటి హాట్ పిక్స్ ను షేర్ చేసుకోనూ వచ్చు. అక్షర పిక్స్ కూడా దాదాపు అలానే ఉన్నాయి. అయితే అవి ఏవో ఫొటో షూట్ సందర్భంగా తీసినవి అని అక్షర అంటోందట. ఎంత ఫొటోషూట్ అయితే మాత్రం అలా తీస్తారా? అనే ప్రశ్న ఇక్కడ ఉండనే ఉంటుంది.
అక్షర పొలిస్ కంప్లైంట్ అయితే ఇచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు తమదైన శైలిలో విచారణ మొదలుపెట్టారని సమాచారం. అక్షర ఈ ఫొటోలను ఎవరితో షేర్ చేసుకునే అవకాశం ఉందో గ్రహించి అటు వైపు నుంచి నరుక్కొస్తున్నారట.
అక్షర బాయ్ ఫ్రెండ్స్ ను ఈ వ్యవహారంలో విచారణ చేస్తున్నారని సమాచారం. అలాగే ఈ వ్యవహారంలో నటి రతి అగ్నిహోత్రి తనయుడు తనూజ్ పేరు కూడా వినిపిస్తోంది. అక్షర, తనూజ్ లో గతంలో రిలేషన్ షిప్ లో ఉండేవారట. ఆ రిలేషన్ షిప్ ఎప్పుడో బ్రేకప్ కూడా అయ్యిందట. బహుశా అక్షర అతడికి ఈ పిక్స్ ను షేర్ చేసి ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తోంది మీడియా.
ఈ మేరకు తనూజ్ తో కూడా మీడియా సంప్రదించింది. అలాంటి ఫొటోలు వెలుగులోకి రావడం చాలా అన్ లక్కీ అని చెప్పిన తనూజ్.. ఆ ఫొటోలు ఎప్పుడూ తన వద్దలేవని చెప్పాడు. తన దగ్గర ఆ ఫొటోలే లేనప్పుడు తను ఎలా లీక్ చేస్తానని అన్నాడు.
కమల్ హాసన్, రతి అగ్నిహోత్రిలది హిట్ పెయిర్. వీరిద్దరూ ఒకే సినిమాతో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ తర్వాత పలు సినిమాల్లో జంటగా నటించారు. ఇప్పుడు వీరి పిల్లల పేర్లు ఒకే వ్యవహారంలో వినిపిస్తున్నాయి.