సినిమాల్లోకి వచ్చిన తరువాత సంపాదించిన డబ్బును, తెచ్చుకున్న క్రేజ్ ను ఏదో విధంగా వాడుకోవాలి. లేదంటే అనవసరంగా వృధా అవుతాయి. అందుకే తారలు ఏదో ఒక వ్యాపారంలోకి దిగుతుంటారు. నిన్నటి నిన్న తమన్నా ఆభరణాల వ్యాపారంలోకి దిగింది. ఇప్పుడు తాప్సీ వంతు వచ్చింది.
Advertisement
అయితే తాప్సీ తెలివిగా పెట్టుబడి లేని వ్యాపారంలోకి దిగుతోంది. అదే పెళ్లిళ్ల వ్యాపారం. అంటే వెడ్డింగ్ ప్లానింగ్. మేనేజ్ మెంట్ వగైరా అన్నమాట. సరైన పెళ్లి ఒక్కటి దొరికితే చాలు ఏడాదికి, ఒక సినిమా చేసినట్లే. అందుకే రంగంలోకి దిగింది తాప్సీ.