Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie Gossip

టీజర్ మనసుకు నచ్చింది

హీరోయిన్ కావాలనుకున్నారు మంజుల ఘట్టమనేని. ఓ హీరో తండ్రి. మరో హీరో సోదరుడు. దాంతో సవాలక్ష ప్రతిబంధకాలు. దాంతో సినిమాల్లో నటించడం మీద కన్నా నిర్మాణం, ఇతరత్రా వ్యాపకాల్లో బిజీ అయ్యారు.

ఇప్పుడే లేటెస్ట్ గా దర్శకత్వ శాఖలోకి ప్రవేశించారు. తనే అన్నీ సమకూర్చుకుని, దర్శకత్వం వహిస్తూ ఓ సినిమాను నిర్మించారు. ఆనంది ఆర్ట్స్ కిరణ్ సహ నిర్మాత.

ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ ఇఫ్పుడు బయటకు వచ్చాయి. సందీప్ కిషన్, అమైనా దస్తూరి నటించిన ఈ సినిమాకు మనసుకు నచ్చింది అని టైటిల్ ఫిక్స్ చేసారు. తన మనసుకు నచ్చింది చేయాలని వుంది అని పదే పదే చెప్పే మంజుల ఘట్టమనేని, అదే టైటిల్ తో సినిమా అందించడం విశేషం. టీజర్ ప్లెజెంట్ గా వుంది.

అరమరికలలు లేని మగ ఆడ స్నేహం నేఫథ్యంలో ఓ ప్రేమ కథ చెబుతున్నట్లు తెలుస్తోంది. విజవల్స్, ఫీలింగ్స్ ఫ్రెష్ గా వున్న ఈ సినిమాతో నైనా సందీప్ కిషన్ కు మాంచి బ్రేక్ వస్తుందేమో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?