కెరీర్ లో ఎప్పుడూ రెండు ప్రాజెక్టులు హ్యాండిల్ చేయలేదు తేజ. ఒక సినిమా కంప్లీట్ అయిన తర్వాత గ్యాప్ తీసుకొని మరో సినిమాను పట్టాలపైకి తీసుకొచ్చేవాడు. కానీ ఈసారి మాత్రం 2సినిమాల్ని సైమల్టేనియస్ గా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఓ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చి మరో సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేయబోతున్నాడు.
త్వరలోనే వెంకటేశ్ తో ఓ సినిమా లాంచ్ చేయబోతున్నాడు తేజ. ఓవైపు వెంకీతో సినిమాకు రెడీ అవుతూనే, మరోవైపు ఎన్టీఆర్ బయోపిక్ పై దృష్టిపెట్టాడు. ఈ సినిమాకు ఫిబ్రవరి నుంచి కాల్షీట్లు కేటాయించాడు బాలయ్య. ఆ టైమ్ కు స్క్రిప్ట్ లాక్ చేసే పనిలో బిజీ అయిపోయాడు తేజ.
ఎన్టీఆర్ జయంతి (మే 28) నాటికి బయోపిక్ ను విడుదల చేయాలని భావిస్తున్నాడు బాలయ్య. ఓ బ్యానర్ స్థాపించి, తనే నిర్మాతగా మారి సినిమా నిర్మించాలని ఫిక్స్ అయ్యాడు. తన బ్యానర్ కు బ్రహ్మతేజ ప్రొడక్షన్స్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్న బాలయ్య.. తన ఇంటికి దగ్గర్లోనే ఆఫీస్ ఏర్పాటుచేసేందుకు 2-3 భవనాల్ని కూడా పరిశీలించాడు.