మొత్తానికి ఆరా..పదమూడా అని కిందా మీదా పడి, ఓవర్ సీస్ జనాలకు 13 అని, ఇక్కడి వారికి ఆరు అని రకరకాల తేదీలు చెప్పిన, నిర్మాత బండ్ల గణేష్ కు ఓ క్లారిటీ వచ్చేసింది. ఫ్రిబ్రవరి 13నే టెంపర్ విడుదల అని కన్ ఫర్మ్ అయిపోయారు.
దీనికి రెండు కారణాలు. ఇంకా పనులు కొంచెం వుండిపోవడం. ఈ రోజు ఇంకా ఓ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. మరోపక్క శివరాత్రి సీజన్ ను క్యాష్ చేసుకోవాలని అనుకోవడం. శివరాత్రి కారణంగా లాంగ్ వీకెండ్ వస్తుంది.
రెండవది ఆ రోజుకు చాలా స్క్రీన్లు ఖాళీ అయిపొతాయి. పటాస్ వచ్చి మూడు వారాలైపోతుంది. అందువల్ల వీలయినన్ని ఎక్కువ స్క్రీన్లలో ప్రదర్శించే అవకాశం ఏర్పడుంది. ఎన్టీఆర్ కు రెవెన్యూ పరంగా బాద్ షా మాంచి ఊపు ఇచ్చింది. ఇప్పుడ దాన్ని దాటాలని, అంతే కాదు, నైజాంలో కనీసం 10 కోట్ల ఓపెనింగ్ లు తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం వీలయినన్ని ఎక్కువ స్క్రీన్ లు దొరికేలా 13న ఫిక్సయ్యారు.