తను తొలి తొలి సినిమాలు చేసిన టాలీవుడ్ పై ఇప్టపికే పలు రకాల కామెంట్లు చేసింది తాప్సీ. టాలీవుడ్ పేరు, ఇక్కడి మూవీ మేకర్ల పేర్లు డైరెక్టుగా ప్రస్తావించకుండానే.. తనను అక్కడ స్కిన్ షోకి వాడుకున్నారని తాప్సీ బాధపడిపోయింది. తనలోని నటన కన్నా వారు తన అందాల ప్రదర్శనకే ఉపయోగించుకున్నారని తాప్సీ వ్యాఖ్యానించింది. ప్రత్యేకించి హిందీలో “పింక్’’ సినిమాతో అభినయానికి అభినందనలు అందుకున్న తర్వాత తాప్సీ ఈ వ్యాఖ్యానాలు చేసింది.
ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తనకు టాలీవుడ్ లో రెమ్యూనరేషన్ విషయంలో కూడా మోసం జరిగిందని తాప్సీ వ్యాఖ్యానించడం. ఒక నిర్మాత తనకు ఇవ్వాల్సిన డబ్బును ఇవ్వలేదని, ఫేక్ చెక్కులను రాసిచ్చి మోసం చేశాడని తాప్సీ పేర్కొంది. అతడి పేరు చెప్పలేదు కానీ.. ఈ మోసం గురించి ఇప్పుడు ప్రస్తావించింది.
షూటింగ్ అంతా అయిపోయాకా తన అవసరం లేదన్నట్టుగా.. వ్యవహరించాడని, వేరే ఆర్టిస్టుతో డబ్బింగ్ చెప్పేంచేసుకున్నాడని, న్యాయంగా దక్కాల్సిన డబ్బు దక్కక తను మోసపోయానని తాప్సీ చెప్పింది. తనకు జరిగిన మోసం గురించి చెప్పడమే కాదు.. తాప్సీ మరో కామెంట్ కూడా చేసింది. “అక్కడ హీరోలకు మాత్రం సమయానికి చెల్లింపులు జరిగిపోతాయ్.. హీరోయిన్లనే ఇలా మోసం చేస్తారు..’’ అంటూ తాప్సీ టాలీవుడ్ తీరును ఎండగట్టింది. బహుశా కాదనలేని నిజమేనేమో ఇది.