నిర్మాతల్లో కాస్త విలక్షణ వ్యక్తిత్వం సాయి కొర్రపాటిది. ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ నుంచి ఈగతో నిర్మాతగా మారారు. అప్పటి నుంచి రాజమౌళికి సన్నిహితుడయ్యారు. ఇప్పుడ బాహుబలి సినిమాకు సీడెడ్, బెంగళూరు, కృష్ణా జిల్లా హక్కులు ఆయనవే.
అయితే బాహుబలికి వచ్చిన క్రేజ్ కు ఆయనకు బెంగుళూరు ప్రాంతానికి భారీ ఆఫర్ వచ్చినట్లు వినికిడి. ఆయన కొన్న మొత్తానికి మరో ఆరు కోట్లు అదనంగా ఇస్తామని ఆఫర్ వచ్చిందని వినికిడి.. దాంతో ఆయన ఆ మేరకు హక్కులు ఇచ్చేసారని అంటున్నారు.
అయితే అది కాదు అసలు పాయింట్..ఇలా వచ్చిన ఆరు కోట్ల లాభంలో బాహుబలి నిర్మాణ సంస్థ ఆర్కా కు మూడు కోట్లు షేర్ ఇచ్చారట. తనకు వచ్చిన లాభం వారికి కూడా చెందుతుందని, అందుకే వెనక్కు మరో మూడు కోట్లు ఇచ్చి, దటీజ్ కొర్రపాటి అనిపించుకున్నారని వినికిడి.