తెలుగు హండ్రెడ్ పర్సెంట్ లవ్ సినిమా తమిళ రీమేక్ లో లావణ్య త్రిపాఠి నటించనున్నట్టుగా మొదట వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఏమైందో ఏమో కానీ ఈ తెలుగు హిట్ తమిళ రీమేక్ లో నటించడానికి ఈమె వెనుకాడింది. ఆ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత ఆ ఛాన్స్ అర్జున్ రెడ్డి భామ శాలినీ పాండేకు దక్కిన సంగతి తెలిసిందే.
మరి ఇంతకీ ఆ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందా? ఈమెతో అయినా సినిమా వస్తుందా? అనేది డౌట్ గానే కనిపిస్తోంది. ఆ సంగతలా ఉంటే… 100పర్సెంట్ లవ్ రీమేక్ నుంచి లావణ్య వైదొలిగిన సమయంలో ఆసక్తికరమైన వార్తలు వచ్చాయి. ఆ సినిమా నుంచి లావణ్య అనూహ్యంగా వైదొలిగింది అని, ఈమె చేసిన పని వల్ల నిర్మాతకు నష్టం కలిగిందని.. దీంతో ఫిర్యాదు అని.. ఆపై ఫైన్ అని.. అది మూడు కోట్లు అని.. ఇలా తమిళ మీడియాలో బోలెడన్ని వార్తలు వచ్చాయి.
అయితే అవన్నీ ఉత్తుత్తివే అని స్పష్టం చేసింది లావణ్య. ఆ సినిమా నుంచి వైదొలగడం నిజమే అని, ఆ ప్రాజెక్టులో కొనసాగడం తనకు సాధ్యం కాలేదని.. వివిధ కారణాల రీత్యా తప్పుకోవాల్సి వచ్చిందని, తప్పుకున్నాను అని.. ఇక ఫిర్యాదు, ఫైన్ అంతా అబద్ధమే అని తేల్చిచెప్పింది. ఆ ప్రచారాన్ని ఇన్నాళ్లూ తను కావాలనే ఖండించలేదు అని.. దాని వల్ల తనకు నష్టంలేదని అనుకున్నాను అని, తను డబ్బు కట్టాల్సిన అవసరం లేనప్పుడు ఏం ప్రచారం చేసుకుంటే తనకేంటని అంటోంది లావణ్య!