థియేటర్ల లో లాక్ అయిపోయిన సొమ్ము

టాలీవుడ్ లో ఒక గొప్ప విషయం వుంది. ఎవడికి చాన్స్ వున్న దగ్గర వాడు ఆఢేసుకుంటాడు. నిర్మాతకు చాన్స్ వస్తే నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కు అవకాశం వస్తే డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ కు టైమ్ వస్తే…

టాలీవుడ్ లో ఒక గొప్ప విషయం వుంది. ఎవడికి చాన్స్ వున్న దగ్గర వాడు ఆఢేసుకుంటాడు. నిర్మాతకు చాన్స్ వస్తే నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కు అవకాశం వస్తే డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ కు టైమ్ వస్తే ఎగ్జిబిటర్ ఇలా ఆటాడేసుకుంటారు. మామూలుగా అయితే ఎగ్జిబిటర్ కు అంత చాన్స్ వుండదు. కానీ థియేటర్లు కనుక సినిమా పెద్దలు చేతిలోకి తీసుకుంటే ఇక డిస్ట్రిబ్యూటర్లకు నెత్తిన తుండుగుడ్డే. తమ జుట్టు తీసుకెళ్లి వాళ్ల చేతిలో పెట్టినట్లే.

ఇప్పుడు చూడండి. నెల్లూరు, గుంటూరు, ఈస్ట్, ఇలా చాలా జిల్లాల్లో డిస్ట్రిబ్యూటర్ల డబ్బు కోట్లకు కోట్లు లాక్ అయిపోయింది. అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు, భీష్మ,  ఇంకా మరి కాస్త వెనక్కు వెళ్తే ప్రతి రోజూ పండగే, ఇంకా ఇంకా వెనక్కు వెళ్తే మజిలీ సినిమాల డబ్బులు థియేటర్ల నుంచి డిస్ట్రిబ్యూటర్లు చేరలేదు.

ఆయా సినిమాలను ఆయా జిల్లాలకు డిస్ట్రిబ్యూట్ చేసిన వారు గట్టిగా అడగలేక, డబ్బులు రాక వడ్డీలు కట్టుకుంటూ కిందా మీదా అవుతున్నారు. నిర్మాతలు ఏమో అక్కౌంట్ సెటిల్ చేయమని వత్తిడి చేస్తారు. థియేటర్ల నుంచి డబ్బులు రావు. పోనీ గట్టిగా గొడవేసుకుందామా? అడుగుదామా? అంటే ఆయా థియేటర్లను రన్ చేస్తున్నవారు టాలీవుడ్ లో పెద్ద సంస్థల యజమానులే. 

టాలీవుడ్ లో ఓ పెద్ద నిర్మాణ సంస్థ తమ తమ థియేటర్లలో వేసిన అనేక సినిమాల డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద మొత్తంలో బకాయిలు పడిందని టాక్. జనం టికెట్ కొని ఇచ్చిన డబ్బుల్లో తమ వాటా తమకు ఇవ్వకుండా వాడేసుకుని, ఇలా ఇబ్బంది పెట్టడం ఏమిటో? అని డిస్ట్రిబ్యూటర్లు వాపొతున్నారు. ఇలాంటి బకాయిలు యాభై అరవై లక్షల మొత్తాల నుంచి కోటి, రెండు కోట్ల మొత్తాల వరకు వున్నాయి. 

అడ్వాన్స్ లు లేవమ్మా

ఇదిలా వుంటే థియేటర్లు అన్నీ తమ గుప్పిట్లో వుంచుకుంటే చాలా అడ్వాంటేజ్ లు వున్నాయి. సినిమా వేస్తే వేసుకో లేదంటే మానేయ్, అడ్వాన్స్ లు అడక్కు అనేది ఓ అడ్వాంటేజ్. డబ్బులు ఇచ్చినపుడు తీసుకో, ఇవ్వనప్పుడు అడక్క ఇది మరోటి. ఇక అద్దెలు, సెకెండ్ వీక్ రూల్స్ అవన్నీ మామూలే. 

ఇదంతా కరోనా ముందు వ్యవహారం. ఇక ఇఫ్పడు కరోనా వచ్చింది. ఇక మాటల్లేవ్, మాట్లాడుకోవాల్లేవ్. ఆపై ఇక ఎప్పుడు సెటిల్ అవుతాయో ఇవన్నీ అని నిట్టూరుస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు.  ఇదిలా వుంటే థియేటర్లు లీజుకు ఇచ్చిన వారు కొందరు కూడా బకాయల వ్యవహారం చూసి, తమ థియేటర్లను వెనక్కు తీసుకున్నారు.

జగన్ లాంటి సీఎంతో పనిచెయ్యడం నా అదృష్టం

జగన్ తో పోటీ కష్టం బాబూ