వచ్చే సోమవారం తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు ప్రభాస్. ఈ పుట్టినరోజు అతడికి వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే బాహుబలి-2 లాంటి చారిత్రక విజయం తర్వాత ప్రభాస్ జరుపుకోబోతున్న బర్త్ డే ఇది. అందుకే ఈసారి ప్రభాస్ పుట్టినరోజును వారం పాటు సెలబ్రేట్ చేయాలని నిర్ణయించారు అతడి ఫ్యాన్స్. ఈ వారానికి “ప్రభాస్ బర్త్ డే వీక్” అని పేరు కూడా పెట్టేశారు.
పుట్టిన రోజు కోసం ఇప్పటికే ప్రభాస్ పై ప్రత్యేకంగా ఓ ఫొటోషూట్ నిర్వహించారు. ఆ ఫొటోల్ని నిన్నట్నుంచి దశలవారీగా విడుదల చేయడం మొదలుపెట్టారు. పైన కనిపిస్తున్న ఫొటో అదే. ఇక పుట్టినరోజున లేదా బర్త్ డేకు ఒక రోజు ముందు సాహో సినిమాకు సంబంధించి ఓ స్టిల్ విడుదల చేసే ఆలోచనలో ఉంది యూనిట్.
అయితే ఎప్పట్లానే ఈ పుట్టినరోజును కూడా సింపుల్ గానే సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించాడు ప్రభాస్. తన క్లోజ్ ఫ్రెండ్స్ కు చిన్న పార్టీ ఇవ్వబోతున్నాడు. మిగతా సమయాన్ని కుటుంబ సభ్యులతో గడపుతాడు. కుదిరితే కొద్దిమంది ఫ్యాన్స్ ను కలుస్తాడు. ఓ ఈవెంట్ పెట్టి కేక్ కట్ చేయడం, ఫొటో సెషన్ లాంటివి మాత్రం లేవు.