Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బ్రేక‌ప్ రూమ‌రే.. ఆ హీరోయిన్ పై హీరోకి ప్రేమే!

బ్రేక‌ప్ రూమ‌రే.. ఆ హీరోయిన్ పై హీరోకి ప్రేమే!

బాలీవుడ్ లో గ‌త ఐదారేళ్ల పై నుంచినే ప్రేమ బంధాన్ని కొన‌సాగిస్తున్న జంట టైగ‌ర్ ష్రాఫ్, దిశా ప‌టానీ. బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ అనిపించుకుంటున్న ఈ హీరోహీరోయిన్లు సుదీర్ఘ‌కాలంగానే ప్రేమ‌లో ఉన్న‌ట్టు! కెరీర్ ఆరంభ స‌మ‌యంలోనే ఒక‌రి ప్రేమ‌లో మ‌రొక‌రుప‌డ్డారు. ఆ త‌ర్వాత వీరు త‌మ బంధాన్ని బ‌హిరంగ ప‌రుచుకోవ‌డానికి కూడా పెద్ద‌గా వెనుకాడింది కానీ, స‌మ‌యం తీసుకున్న‌ది కానీ లేదు! క‌లిసి విహ‌రిస్తూ.. వేర్వేరుగా ఫొటోలు పెట్టేవారు మొద‌ట్లో. 

అయితే ప‌రిస‌రాలు ఒకేలా ఉండ‌టంతో దొరికిపోయేవారు. ఆ త‌ర్వాత ఈ టాపిక్ గురించి చ‌ర్చ అన‌స‌వ‌రం అన్న‌ట్టుగా.. త‌మ ప్రేమ‌బంధాన్ని ఫొటోల‌తో ధ్రువీక‌రించారు. అయితే అంత‌కు మించి వీరు మీడియాలో త‌మ బంధం గురించి చ‌ర్చ పెట్టే వారు కాదు!

అయితే వీళ్ల ప్రేమ ఆరేళ్ల‌కు పైన‌దే అయినా.. ఇప్పుడు ఉన్న‌ట్టుండి వీరి బ్రేక‌ప్ పుకార్లు వినిపించ‌డం మొద‌లైంది. వీరు విడిపోయిన‌ట్టుగా ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది. ఈ అంశం గురించి టైగ‌ర్ తండ్రి ని కూడా ఆరాతీసింది మీడియా. అయితే ఆయ‌న వారు అన్యోన్యంగానే క‌నిపించార‌ని, అయినా రోజువారీగా వారి ప్రేమ గురించి త‌ను అప్ డేట్స్ తీసుకోనంటూ జాకీ తెలివిగానే స‌మాధానం ఇచ్చారు. ఇంత‌లో.. దిశ టైగ‌ర్ వ‌ద్ద పెళ్లి ప్ర‌తిపాద‌న చేసింద‌ని, పెళ్లి చేసుకునే ఆలోచ‌న అత‌డికి లేక‌పోవ‌డమే బ్రేక‌ప్ కు కార‌ణ‌మ‌నే మాటా వినిపించింది.

అయితే ఈ రూమ‌ర్ల‌కు కాస్త తెరదించే య‌త్న‌మో ఏమో కానీ.. దిశా ప‌టానీ సినిమాను ప్ర‌మోట్ చేస్తూ టైగ‌ర్ పెట్టిన ఇన్ స్టా పోస్టు ఆస‌క్తిదాయ‌కంగా ఉంది. దిశ ప‌టానీ న‌టించిన ఏక్ విల‌న్ రిట‌ర్న్స్ అనే సినిమాను ప్ర‌శంసిస్తూ టైగ‌ర్ ష్రాఫ్ పోస్టు పెట్టాడు. ఆ పోస్టులో దిశ‌ను కూడా ట్యాగ్ చేశాడు. ఒక‌వేళ వీరి మ‌ధ్య ఎడం పెరిగి ఉంటే.. ఇలాంటి ప్ర‌మోష‌న్లు ఉండ‌వు. 

బాలీవుడ్ జ‌నాలు ఇలాంటి విష‌యాల్లో చాలా క‌చ్చితంగా ఉంటున్నారు. బ్రేక‌ప్ త‌ర్వాత ఒక‌రి సినిమా గురించి మ‌రొక‌రు మాట్లాడుకోవ‌డానికి కూడా ఇష్ట‌ప‌డ‌రు. సోష‌ల్ మీడియాలో అన్ ఫాలోయింగ్ కూడా త‌ప్ప‌నిస‌రి! అందుకు విరుద్ధంగా టైగ‌ర్ పోస్టు ఉండ‌టంతో.. వీరి బ్రేక‌ప్ రూమ‌ర్ల‌కు కాస్త విరామం దొరికిన‌ట్టుగా ఉంది!

నేను రెడ్డి అని ఎందుకు పెట్టుకున్నానంటే...

జ‌గ‌న్ ను చూసి నేను మారను