టాలీవుడ్ కు ఓ ట్రెండ్ అంటూ మొదలయితే ఇక అదే పోక. ప్రభాస్ తో నాగ్ అశ్విన్ సినిమాలో టైమ్ ట్రావెల్ వుంటుదని ఇప్పటికే బయటకు వచ్చింది. దాంతో ఆ సినిమాలో టైమ్ ట్రావెల్ వుంది..ఈ సినిమాలో టైమ్ ట్రావెల్ వుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే శర్వానంద్ నటిస్తున్న ఓ సినిమాలో చిత్రమైన టైమ్ ట్రావెల్ వుందని తెలుస్తోంది. సాధారణంగా టైమ్ ట్రావెల్ అంటే గతంలోకో, భవిష్యత్ లోకో వెళ్లి, అప్పట్లో వేరే వారి వ్యవహారాలు ఎలా వుంటాయో గమనించడం. కానీ ఈ శర్వా సినిమాలో అలా కాదట.
శర్వా, అతని స్నేహితులు టైమ్ ట్రావెల్ తో తమ బాల్యంలోకే వెళ్తారు. తమ స్టూడెంట్ డేస్ ఎలా గడిచాయి, తమ స్నేహాలు, ప్రేమలు, ఇలాంటి అన్నీ తెలుసుకుంటారట. అంటే వారి చిన్న తనాన్ని, యవ్వనాన్ని, వారే పక్కన వుండి గమనించడం అన్నమాట,.
కాస్త కొత్తగా, మరికాస్త డిఫరెంట్ గా వుందిగా పాయింట్. మరి సినిమా ఎలా వుంటుందో చూడాలి.