ఏనుగు సామెత అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా టైటిల్ బయటకు వచ్చింది. త్రివిక్రమ్, హారిక హాసిని జనాల ముహుర్తాల నమ్మకాల మేరకు 4.50కి విడుదల చేసారు. అయితే నిన్నే షూటింగ్ స్పాట్ కు వచ్చిన కొందరితో టైటిల్ డిస్కస్ చేయడంతో ముందుగానే కొన్ని టైటిల్స్ బయటకు వచ్చాయి. ఈ ఉదయం నుంచి కసరత్తులు చేసి చేసి ఆఖరికి బయటకు వదిలారు.
ఒకపక్క ఎన్టీఆర్ కు అ. ఆ లెటర్ లతో పెద్ద హిట్ లు.. భారీ ప్లాప్ లు ఉన్నాయి. హారికకు కూడా అదే పరిస్థితి. కానీ ఆఖరికి త్రివిక్రమ్ అ సెంటిమెంట్ నే గెలిచింది. వీర రాఘవ అన్న టైటిల్ పెడదామని మళ్ళీ ఆగింది అందుకే. మరోపక్క హారిక జనాలు కావాలని తప్పుడు లీక్స్ కూడా ఇచ్చారని వినికిడి.
మీడియాను తప్పుదారి పట్టించడం కోసం కొందరు సినిమా జనాలకు కావాలని హారిక నుంచి రాంగ్ లీక్స్ వెళ్లినట్లు సమాచారం. టైటిల్ విడుదల విషయంలో ఇంత శ్రద్ధ మంచిదే. సినిమా కథ కథనాల విషయంలో కూడా త్రివిక్రమ్ ఈ శ్రద్ధ చూపించాలి.
ఆయన పుణ్యమా అని పవన్ సినిమాలే వదిలేశారు. ఈసారి తేడావస్తే త్రివిక్రమ్ కె కష్టం. ఎన్టీఆర్ కి కాదు.