మహేష్ సినిమాకు సంబంధించి ‘రిషి’ అన్న పేరు ఒకటి మెల్లగా బయటకు వచ్చేసింది. ఆర్.ఐ.ఎస్ అక్షరాలు సోషల్ నెట్ వర్క్ లోకి వదలడంతో, రిషి అన్నది హీరో పేరు అయి వుంటుందని అందరూ గెస్ చేసారు. ట్విట్లర్ లో హల్ చల్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ లెటర్స్ ను ముందు జంబ్లింగ్ కింద వదులుదాం అనుకున్నారట. అంటే వరుసగా కాకుండా రాండమ్ గా అన్నమాట. కానీ అలా అయితే ఫ్యాన్స్ కు హుషారు వుండదు, కాస్త ఈజీ క్లూ వుంటేనే బెటర్ అనడంతో వరుసగా వదుల్తున్నారు.
ఇదిలా వుంటే హీరో పేరు రిషి అన్నది కన్ ఫర్మ్. అందులో అణుమాత్రం సందేహంలేదు. అయితే ఇదే సినిమా టైటిల్ అని కూడా అనౌన్స్ చేసేయడమా? అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు పాయింట్లపై దర్శకుడు వంశీ పైడిపల్లి కిందామీద అవుతున్నట్లు బోగట్టా.
ఒకటి:- టైటిల్ ఇప్పుడు అనౌన్స్ చేసేయాలా? విడుదల ఇంకా చాలాదూరం వుంది కాబట్టి ఆగాలా?
రెండవది:- టైటిల్ గా రిషి అనే పెట్టేయాలా? లేక ఇంకా బెటర్ టైటిల్ ఏమన్నా దొరుకుతుందా?
ఈ రెండు విషయాలపై రేపటికి క్లారిటీ వచ్చేస్తుంది. ఆ తరువాత రిషి అన్నది కేవలం హీరో పేరుగానేనా, సినిమా టైటిల్ గా కూడా వుంటుందా అన్నది తేలిపోతుంది.