ఎనర్జిటిక్ హీరో రామ్. ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ వెంటనే మళ్లీ తన స్వంత బ్యానర్ లో సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు. అన్నివిధాలా మాంచి ఫార్మాలా స్టోరీ ఒకదాన్ని తీసుకుని సినిమా చేయబోతున్నాడు. రెడ్ అనే టైటిల్ పెట్టిన ఆ సినిమాలో రామ్ రెండు పాత్రలో పోషించబోతున్నట్లు తెలుస్తోంది. రామ్ డబుల్ రోల్ చేయడం ఇదే తొలిసారి. మొన్నటికి మొన్నే డబుల్ ఇస్మార్ట్ అంటూ రెండు షేడ్స్ పాత్రలు చేసిన రామ్, ఇప్పుడు ఏకంగా డబుల్ రోల్ నే చేయబోతున్నాడు.
రామ్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తారు ఈ సినిమాలో. ఒక హీరోయిన్ గా మాళవిక శర్మను ఎంపికచేసినట్లు తెలుస్తోంది. ఇంకో హీరోయిన్ గా కొత్త అమ్మాయిన తీసుకునే ఆలోచన చేస్తున్నారు. సినిమాను ఈ బుధవారమే ప్రారంభిస్తున్నారు. చకచకా ఫినిష్ చేసి ప్రీ సమ్మర్ వేళకు రెడీ చేయాలనే ఆలోచనలో వున్నారు.
రామ్ తో రెండు సినిమాలు చేసిన కిషోర్ తిరుమల రెడ్ సినిమాకు దర్శకుడు.