టాలీవుడ్ లో మరిన్ని కేసులు?

కరోనా అన్నది రాను రాను కామన్ డిసీజ్ గా మారుతోంది. హైదరాబాద్ లోనే కాదు, ఎక్కడా కూడా ఎవరినీ వదలిపెట్టడం లేదు. ఎమ్మెల్యేలు, సెలబ్రిటీలను కూడా టచ్ చేస్తోంది. టాలీవుడ్ లో నిర్మాత బండ్ల…

కరోనా అన్నది రాను రాను కామన్ డిసీజ్ గా మారుతోంది. హైదరాబాద్ లోనే కాదు, ఎక్కడా కూడా ఎవరినీ వదలిపెట్టడం లేదు. ఎమ్మెల్యేలు, సెలబ్రిటీలను కూడా టచ్ చేస్తోంది. టాలీవుడ్ లో నిర్మాత బండ్ల గణేష్ కు కరోనా సోకిందని వార్తలు రావడంతో కలవరం బయలు దేరింది.

నిన్నటి నిన్న టాలీవుడ్ లో రకరకాల గ్యాసిప్ లు వినిపించడం ప్రారంభించాయి. మరి కొందరికి కూడా కోవిడ్ బాధ తప్పలేదని వినిపించింది. ఓ యువ దర్శకురాలు ఇటీవలే కోవిడ్ బారిన పడి కోలుకుందని అంటున్నారు. అలాగే ఓ పాపులర్ రచయిత కు కూడా కోవిడ్ లక్షణాల కనిపించాయని, హోమ్ క్వారంటైన్ లో వుండి జాగ్రత్డలు తీసుకుంటున్నారని మరో గ్యాసిప్ వినిపించింది.

సెలబ్రిటీలు కావడంతో ఎక్కడా ఏమీ తెలియడం లేదు. కానీ అలా అని గ్యాసిప్ లు వినిపించడం ఆగలేదు. మొత్తం మీద  కరోనా ఒక కొలిక్కి వస్తోంది. జూలై నుంచి షూటింగ్ లకు వెళ్దాం అనుకునే సమయంలో ఈ వదంతులు అన్నీ కలిసి షూటింగ్ లను మరింత వెనక్కు నెట్టేసాయి. 

అసలే షూటింగ్ లకు రాము కాక రాము అని సీనియర్ హీరోలు అందరూ ఎప్పుడో చెప్పేసారు. మహేష్ లాంటి హీరోలు కూడా రామని చెప్పేసారు. ఇప్పుడు ఈ హడావుడితో మిగిలిన వారు కూడా సైలంట్ అయిపోయారు. టాలీవుడ్ లో షూటింగ్ ల సందడి ఇక ఇప్పట్లో లేనట్లే.

రెండో భార్యతో తిరుమలకు దిల్ రాజు

మరో 30ఏళ్ళు నువ్వే ఉండాలన్నా