రీమేక్‌ల సంప్రదాయం కాస్త… ఫ్రీమేక్‌గా మారిపోతోంది. కథ కోసం అన్ని కోట్లు తగలేయడం ఎందుకు?? అనుకొని తెలివిగా ఆ కథని ఎత్తేయడానికి ప్లాన్ చేసుకొంటున్నారు. ఇప్పుడు శర్వానంద్ సినిమా కూడా ఓ హాలీవుడ్ కథకు స్ఫూర్తేనట.
శర్వానంద్ కథానాయకుడిగా రన్ రాజా రన్ అనే చిత్రం తెరకెక్కుతోంది. జర్మన్ భాషలో తెరకెక్కించిన రన్ లోలా రన్ (1998) సినిమాకి స్ఫూర్తి అట. అయితే దాన్ని దర్శకుడు తెలివిగా తెలుగీకరించడాని, అసలు జర్మన్ సినిమా వాసనలే కనిపించవని చెబుతున్నారు.
ఈ సినిమాతో శర్వానంద్ మాస్ హీరోగా నిలబడే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది వరకు కో అంటే కోటి సినిమాతో కూడా శర్వా ఇలాంటి సాహసాలే చేశాడు. ఆ సినిమాకి నిర్మాత కూడా ఆయనే. అటు హీరోగా, ఇటు నిర్మాతగా ఆ సినిమా చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఇక రన్ రాజా రన్… ఏం చేస్తాడో?