టాలీవుడ్ లోకి మరో పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఎంటర్ అవుతోంది. ఫ్రస్తుతానికి వివరాలు గోప్యంగా వుంచిన ఈ ప్రొడక్షన్ హౌస్ ఓ చిన్న సినిమాతో ముందుగా రంగంలోకి దిగుతోంది.
భద్ర ప్రొడక్షన్స్.. టాలీవుడ్‌లో కంటెంట్ బేస్డ్, డిఫరెంట్ జోనర్ చిత్రాలను భారీ స్థాయిలో నిర్మించడానికి అడుగుపెడుతోంది. ఈ నిర్మాణ సంస్థ ఆసక్తికరమైన చిత్రాలను రూపొందించనుంది. అందులో భాగంగా ఈ బ్యానర్‌లో చేయబోతున్న ప్రొడక్షన్ నెం.1 ను అనౌన్స్ చేశారు.
న్యూ ఏజ్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. దర్శకుడు శ్రీనివాస్ రాజు అందరికీ నచ్చేలా వైవిధ్యమైన కథాంశంతో స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. మంచి స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.
100% లవ్ సినిమా కెమెరామెన్ వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి గ్యారీ బి.హెచ్ ఎడిటర్. త్వరలోనే ఈ సినిమాలో పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేయనున్నారు.