ఆమె నటిస్తుంటే అంతా నవ్వుతున్నారు

నేను అరుంధతినిరా అనే డైలాగ్ వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇది భాగమతి అడ్డా అనే డైలాగ్ టోటల్ సినిమాకే హైలెట్. నేనే మోహిని అనే డైలాగ్ కూడా పై లిస్ట్ లోకి చేరిపోతుందని కలలు…

నేను అరుంధతినిరా అనే డైలాగ్ వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇది భాగమతి అడ్డా అనే డైలాగ్ టోటల్ సినిమాకే హైలెట్. నేనే మోహిని అనే డైలాగ్ కూడా పై లిస్ట్ లోకి చేరిపోతుందని కలలు కనింది త్రిష. కానీ మోహినిలో ఆమె యాక్టింగ్ ఎటెన్షన్ క్రియేట్ చేయకపోగా నవ్వు తెప్పించింది. అవును.. మోహిని అంటూ త్రిష సీరియస్ గా డైలాగ్ చెబుతుంటే థియేటర్లలో ఒకటే నవ్వులు. 

అనుష్క, నయనతార టైపులో యాక్షన్ ఇమేజ్ కోసం చాన్నాళ్లుగా ఎదురుచూస్తోంది త్రిష. వాళ్లకంటే సీనియర్ అయినప్పటికీ ఇప్పటివరకు 'లేడీ బిగ్ బాస్' ఇమేజ్ అందుకోలేకపోయాననే బాధ త్రిషలో ఎప్పట్నుంచో ఉంది. ఈ బాధను బాగానే పసిగట్టాడు దర్శకుడు మాధేష్. ఇంకేముంది.. ఓ హారర్ కథ రాసుకున్నాడు. త్రిషను ఇంప్రెస్ చేయడం కోసం ఆమెకి డ్యూయల్ రోల్ కూడా కట్టబెట్టాడు. 

అంతా తను అనుకున్నట్టు ఉండడంతో త్రిష కూడా ఓకే అనేసింది. కానీ ఈ మొత్తం ప్రహసనంలో కథను గాలికి వదిలేశారు. ఎప్పుడో అరుంధతికి పదేళ్ల ముందు రావాల్సిన కథను ఇప్పుడు తీశారు. పైగా తెలుగు సీరియల్స్ కు ఏమాత్రం తీసిపోని గ్రాఫిక్స్. దానికితోడు అంగుళం మేకప్ తో త్రిష అభినయం. ఇంకేముంది మోహిని థియేటర్లలో నవ్వులే నవ్వులు. 

హారర్ పండకపోతే ఎలా ఉంటుందనేదానికి మోహిని పెర్ ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచింది. తెలుగులోనే కాదు, తమిళ్ లో కూడా ఈ సినిమా పరిస్థితి ఇదే. ఇకనైనా త్రిష ఇలాంటి 'యాక్షన్ డ్రామా'లు ఆపితే మంచిది. లేదంటే మరో కామెడీ ఎంటర్ టైనర్ రెడీ అయిపోద్ది.