హీరోయిన్ల పెళ్లి వ్యవహారాలన్నీ ఇప్పుడు గుంభనంగా సాగిపోతున్నాయి. మొన్నటికి మొన్న శ్రియ చాలా పెద్ద షాపింగ్ చేసింది. అడిగితే తన ఫ్రెండ్ పెళ్లి అని చెప్పుకొచ్చింది. కట్ చేస్తే తనే పెళ్లి చేసుకుంది. ఈమధ్య జరిగిన సోనమ్ కపూర్, నేహా ధూపియా పెళ్లిళ్లు కూడా ఇలానే సీక్రెట్ గా జరిగాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి త్రిష కూడా చేరబోతోందా..? ఆమె కూడా సీక్రెట్ గానే పెళ్లి చేసుకుంటుందా..?
ప్రస్తుతం త్రిషను చూస్తుంటే ఇలాంటి అనుమానానే కలుగుతున్నాయి. రీసెంట్ గా 35వ ఏట అడుగుపెట్టిన త్రిష, భారీగా షాపింగ్స్ చేస్తోంది. ఈమధ్యే తన ఫ్రెండ్స్ తో కలిసి విదేశాలకు కూడా వెళ్లి వచ్చింది. అక్కడ కూడా భారీ షాపింగ్ చేసింది. అడిగితే మాత్రం ఏం లేదన్నట్టు కవర్ చేస్తోంది. కానీ ఆమె షాపింగ్ చూస్తుంటే కచ్చితంగా అది వెడ్డింగ్ షాపింగే అంటోంది ఆమె క్లోజ్ సర్కిల్.
త్రిష పెళ్లిపై చాలా ఏళ్లుగా పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఓ బిజినెస్ మేన్ తో ఆమె చాలా క్లోజ్ గా ఉంటోందంటూ దాదాపు నాలుగేళ్లుగా రూమర్స్ వస్తున్నాయి. వీటిని త్రిష తల్లి ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. కానీ ఈ ఏడాది మాత్రం త్రిష పెళ్లి గ్యారెంటీ అంటూ గట్టిగా ప్రచారం సాగుతోంది. మరో 2-3 నెలల్లో ఆమె పెళ్లి చేసుకునే ప్లాన్స్ లో ఉందట.
ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలున్నాయి. వీటిలో 3సినిమాలు షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్నాయి. మరో 3సినిమాలు షూటింగ్ స్టేజ్ లో ఉన్నాయి. ఈ మూడూ ఓ కొలిక్కి వచ్చిన వెంటనే త్రిష పెళ్లి వార్త బయటకొచ్చే అవకాశముంది.