త్రివిక్రమ్ డైరక్షన్ లో ఎన్టీఆర్

ఇదే మన్నా కొత్త వార్తనా? అదెప్పుడో ఫిక్స్ అయింది. క్లాప్ పడింది. త్వరలో షూట్ కూడా ప్రారంభం అవుతుంది అని తొందరపడి అనేయద్దు. ఇది వేరే వ్యవహారం.  Advertisement త్రివిక్రమ్ డైరక్షన్ లో ఎన్టీఆర్…

ఇదే మన్నా కొత్త వార్తనా? అదెప్పుడో ఫిక్స్ అయింది. క్లాప్ పడింది. త్వరలో షూట్ కూడా ప్రారంభం అవుతుంది అని తొందరపడి అనేయద్దు. ఇది వేరే వ్యవహారం. 

త్రివిక్రమ్ డైరక్షన్ లో ఎన్టీఆర్ ఓ ప్రకటనలో నటిస్తున్నారు. ఐపిఎల్ స్టార్ మా తెలుగు క్రికెట్ ప్రసారాలకు ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రోమోలు, ప్రకటనల షూట్ వ్యవహారం ప్రారంభమైంది.

వీటన్నింటికి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నే డైరక్షన్ చేస్తున్నారు. హైదరాబాద్ నగర శివార్లలోని ఓ ప్రయివేట్ విల్లాలో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది.

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అజ్ఞాతవాసి పరాజయం తరువాత మళ్లీ మెగా ఫోన్ పట్టుకోవడం ఇదే. గతంలో కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో, ఎన్టీఆర్ తో కలిసి కొన్ని వాణిజ్య ప్రకటనలు చేసారు.