Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

త్రివిక్రమ్ ఎఫెక్ట్ ‘గుంటూరు కారం’ మీద?

త్రివిక్రమ్ ఎఫెక్ట్ ‘గుంటూరు కారం’ మీద?

బ్రో సినిమా ఇప్పుడు త్రివిక్రమ్ కు బ్లాక్ స్పాట్‌గా మారుతోంది. గురూజీ.. గురూజీ అనిపించుకున్న త్రివిక్రమ్ ఇప్పుడు పొలిటికల్ గా టార్గెట్ అవుతున్నారు. 

వైకాపా నాయకులు, అభిమానులు ఇప్పుడు త్రివిక్రమ్ అంటే మండి పడుతున్నారు. మంత్రి అంబటి రాంబాబు నేరుగానే త్రివిక్రమ్ పర్యవసానాలు ఫేస్ చేయాల్సి వుంటుందని హెచ్చరించారు. ఎన్నికలకు ఇంకా ఏడాది కాలం సమయం వుంది. ఈ లోగానే త్రివిక్రమ్ తన గుంటూరు కారం సినిమాను విడుదల చేయాల్సి వుంది.

మహేష్ బాబు సినిమా కనుక రాజకీయపు వాసనలు ఏవీ వుండవు. అలాంటి పప్పులు మహేష్ బాబు దగ్గర ఉడకవు. కానీ అది కాదు సమస్య. సినిమాకు అదనపు రేట్లు కావాలి అంటే ప్రభుత్వం దగ్గరకు ఏమని వెళ్లి అడుగుతారు. మహేష్ బాబు సినిమా అని మాత్రమేనా. త్రివిక్రమ్ సినిమా అని చెప్పిన తరువాత పరిస్థితి ఎలా వుంటుంది?

సినిమా యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తే సరేసరి, ఏమాత్రం డివైడ్ టాక్ వచ్చినా, వైకాపా జనాలు త్రివిక్రమ్ ను ఏ రేంజ్ లో ట్రోల్ చేస్తారు? ఇప్పటికే పవన్ స్పీచ్ లు, ఆలోచనా ధోరణి వెనుక త్రివిక్రమ్ వున్నారనే టాక్ బలంగా వుంది. 

బ్రో సినిమాతో అది మరింత బలమైన అభిప్రాయంగా మారుతోంది. ఇది త్రివిక్రమ్ సినిమాలకు, నిర్మాతలకు, హీరోలకు కష్టమే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?