త్రివిక్రమ్…ఎందరితో ?

ఒక్క త్రివిక్రముడు..ఎందరితో, ఎన్ని సినిమాలు చేస్తాడు? ఒక పక్క  బన్నీతో సినిమా చేస్తున్నాడు. అది కొలిక్కి వస్తోంది. కొరటాల శివ సినిమా తరువాత మహేష్ తో సినిమా అన్న టాక్ వుంది. అయినా అక్కడ…

ఒక్క త్రివిక్రముడు..ఎందరితో, ఎన్ని సినిమాలు చేస్తాడు? ఒక పక్క  బన్నీతో సినిమా చేస్తున్నాడు. అది కొలిక్కి వస్తోంది. కొరటాల శివ సినిమా తరువాత మహేష్ తో సినిమా అన్న టాక్ వుంది. అయినా అక్కడ మరో ఒకరిద్దరు కూడా లైన్ లో వున్నారు. ఈ లోగా అఖిల్ తో మరో సినిమాను త్రివిక్రమ్ చేస్తాడని గుసగుస. 

నిజానికి అఖిల్ తొలిసినిమా కోసమే నాగ్ చాలా గట్టిగా త్రివిక్రమ్ కోసం ప్రయత్నించాడని, కావాలంటే మహేష్ బాబును కూడా ఒప్పిస్తానని అన్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు కనీసం రెండో సినిమా అయినా చేయమని, అది తానే ప్రొడ్యూస్ చేస్తానని అంటున్నాడట. దానికి త్రివిక్రమ్ ఒకె అన్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇవే నిజమైతే, కొరటాల శివతో సినిమా తరువాత మహేష్ తన సినిమా త్రివిక్రమ్ తో కాక వేరే డైరక్టర్ కు కమిట్ కావాల్సి వుంటుంది. బహుశా అది శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మోత్సవం కావచ్చు.