పేరు పెట్టి చెప్పకపోవచ్చు, పేరు పెట్టి ఆరోపించకపోవచ్చు, కానీ హీరోయిన్ పూనమ్ కౌర్ మాత్రం అవకాశం దొరికినపుడల్లా, ఓ గ్యాసిప్ ట్వీట్ వేస్తూనే వస్తోంది. సినిమా ఇండస్ట్రీ జనాల ఆనుపానులు తెలిసిన వారంతా ఈ ట్వీట్ లు చూసి, పూనమ్ కౌర్ ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ లు వేస్తున్నదో, ఎవరిపై బాణాలు ఎక్కుపెడుతోందో అర్థం అయిపోతూనే వుంది.
పైగా ఆమె టార్గెట్ వేరు. ఆమె నేరుగా పేరు పెట్టి ఆరోపణ చేయదు. నేరుగా పేరుపెట్టి విమర్శించదు. కానీ ఆమె ట్వీట్ లు మీడియాను అలెర్ట్ చేస్తాయి. చకచకా వార్తలు వండేలా చేస్తాయి. దాంతో త్రివిక్రమ్, పవన్ బంధం మీద, పవన్ వైవాహిక బంధం మీద, ఇంకా ఇంకా అనేక విషయాలపై వార్తలు తయారైపోతాయి.
పూనమ్ కౌర్ టార్గెట్ ఇంతవరకే అనిపిస్తోంది. మారిపోతుంది, మానిపోతుంది అన్న గాయాన్ని తరచు ఓసారి కెలకడం. పవన్-రేణుదేశాయ్ ల విడాకుల వ్యవహారం వారికి మాత్రమే తెలిసిన వ్యవహారం. రేణుదేశాయ్ చాలా పరిణితి గల గృహిణి. పవన్ కళ్యాణ్ ఎన్నో పుస్తకాలు చదివి, రంగరించుకున్న మేధావి అని పదే పదే ఏదో విధంగా ప్రకటితమయ్యేలా చేస్తుంటారు. ఇలాంటి ఇద్దరి మధ్య సింపుల్ గా నిప్పు రాజేసి, విడిపోయేలా చేయడం ఎంత గురూజీ అయినా త్రివిక్రమ్ కు సాధ్యం అయ్యే పనేనా? పవన్ కు ఆ ఇంటెన్షన్ లేనిదే వీలు అవుతుందా?
చిత్రమేమిటంటే విడాకులు తీసుకున్న పవన్-రేణు బాగానే వున్నారు. ఒకరిని ఒకరు పల్లెత్తు మాట అనుకోవడం లేదు. రేణు దేశాయ్ ఎలాగైనా తన కొడుకును పవన్ సినిమా వారసుడిని చేయాలనే అనుకుంటోంది. అలాంటపుడు పవన్ సహకారం ఎంత అవసరమో ఆమెకు తెలియంది కాదు. పైగా అదే కార్యక్రమానికి త్రివిక్రమ్ సహాయం కూడా అవసరమే.
మరి మధ్యలో పూనమ్ కౌర్ కు మాత్రం ఆ గ్యాసిప్ ట్వీట్ లు ఎందుకో? ఆమె ట్వీట్ వేసినపుడల్లా, దాన్ని డీకోడ్ చేస్తూ మీడియాలో వార్తలు రావడం, త్రివిక్రమ్ ఈ అపనిందలు ఇలా మోస్తూ వుండడం, ఎప్పటికి ఆగుతుందో?