Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

త్రివిక్రమ్ ఫీలయ్యారట

 త్రివిక్రమ్ ఫీలయ్యారట

అందరు దర్శకులు ఒకలా వుండరు. టాప్ డైరక్టర్ల తీరువేరు. వారు తమ ప్రాజెక్టుల గురించి అంత సులవుగా రివీల్ చేయరు. ఎవరైనా అలా ప్రకటిస్తే ఫీలవుతారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విషయంలో ఇలాగే జరిగిందట. ఆ మధ్య అ..ఆ విషయంలో ప్రమోషన్ మీట్ పెడతాను అని నిర్మాత దిల్ రాజు అంటే ఓకె అన్నారు. ఎందుకంటే ఎనిమిది కోట్లకు పైగా చెల్లించి నైజాం హక్కులు తీసుకున్నారు పైగా..పైగా సినిమా మరింత కలెక్ట్ చేస్తే నిర్మాతకు కూడా మంచిదే కదా అని. 

కానీ ఏమయింది..అదే మీట్ లో తాను త్వరలో ఓ టాప్ స్టార్ కాంబినేషన్ లో త్రివిక్రమ్ డైరక్షన్లో  సినిమా చేస్తా అని దిల్ రాజు ప్రకటించారు. ఇదే త్రివిక్రమ్ ఫీల్ అయ్యేలా చేసిందట. నిజానికి ఏదో కాజువల్ గా అలాగే చేద్దాం అంటే దాన్ని ఇలా ప్రకటిస్తారు దిల్ రాజు అని అనుకోలేదట త్రివిక్రమ్. 

పెద్ద నిర్మాత కానీ హీరో కానీ మనం సినిమా చేయాలి సార్ అని అంటే.. అలాగే అంటాం కానీ, నో అనం కదా.. అదే పద్దతిలో దిల్ రాజు తో అలాగే అంటే ఇలా ప్రకటించేసారు అని దిల్ రాజు తన సన్నిహితుల దగ్గర చెప్పినట్లు వినికిడి. తనను ఇలా ఇరికిద్దామని చూడడం పట్ల త్రివిక్రమ్ ఫీలయ్యారట. అయినా ఈ మధ్య దిల్ రాజుకు ఏదో ఒక సినిమా ప్రకటించేయడం పట్ల ఉత్సాహం ఎక్కువగా వుంది. ఏమిటో మరి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?