Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

త్రివిక్రమ్ కు కూడా టైటేనంట

త్రివిక్రమ్ కు కూడా టైటేనంట

సాధారణంగా సినిమాకు పది కోట్లు తీసుకునే సెలబ్రిటీ అంటే ఆయనకేంటీ బోలెడు డబ్బులు అని అనుకోవడం సహజం. కానీ పీత కష్టాలు పీతవి అన్నట్లు వాళ్లకీ పాపం సమస్యలే. అ..ఆ సినిమాకు దర్శకత్వం వహించినందుకు తొమ్మిది నుంచి పది కోట్లు తీసుకున్న డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు కూడా డబ్బులు టైటేనట. 

కారణం, ఆయన ఓ మాంచి ఇల్లు కట్టుకునే పనిలో వుండడమే. ఫిల్మ్ నగర్ ఎబిఎన్ కార్యాలయం ఎదరుగుండా రోడ్ లో త్రివిక్రమ్ మాంచి ఇల్లు నిర్మించుకుంటున్నారు. ఆ సైట్ కాస్ట్ నే పది కోట్ల వరకు వుంటుందట. పైగా ఆ ఇంటిని తన అభిరుచి మేరకు నిర్మించుకుంటున్నారు. దానికి ఇంటీరియర్ అంతా ఫేమస్ ఆర్ట్ డైరక్టర్ రవీందర్ (అత్తారింటికి దారేది, జులాయి) పర్యవేక్షణలో జరుగుతోందని తెలుస్తోంది.  

అత్తారింటికి దారేది సినిమా విషయంలో త్రివిక్రమ్ కు పెద్దగా ముట్టింది లేదు. సన్నాఫ్ సత్యమూర్తి, జులాయి, అ..ఆ సినిమాల వల్లే కాస్త డబ్బులు వచ్చాయట. అంతకు ముందు ఆ రేంజ్ రెమ్యూనిరేషన్ లేదు. అంటే ఈ మూడు సినిమాలకు కలిసి ఇరవై కోట్లు వచ్చాయనకున్నా ఇంటి స్థలానికే పది కోట్లు ఖర్చయిపోయినట్లే. మరి ఇల్లు నిర్మాణం? అందుకే త్రివిక్రమ్ కూడా కాస్త పైసలు టైట్ అని ఇండస్ట్రీ గుసగుస. 

అయినా నో ప్రోబ్లమ్. త్వరలో పవన్ తో, మహేష్ తో రెండు సినిమాలు చేస్తారు కాబట్టి సెట్ రైట్ అయిపోతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?