సినిమా రంగంలో సెంటిమెంట్లు ఎక్కువ. ఓ హీరోగారు.. ముహూర్తం చూడనిదే అడుగైనా బయట పెట్టరన్న సంగతి టాలీవుడ్ మొత్తానికీ తెలుసు. సినిమా ఓపెనింగ్స్, ఆడియో ఫంక్షన్స్… ఇలా ప్రతీ విషయంలోనూ ముహూర్తాల్ని ఫాలో అయ్యేవాళ్లు ఎక్కువ. ఇప్పుడు త్రివిక్రమ్ కీ ఈ ధ్యాస బాగా పెరిగిపోయిందట.
తన సెంటిమెంట్ పిచ్చిని తన చుట్టు పక్కన వాళ్లకూ అంటించేశాడట. అ..ఆ టీజర్ రిలీజ్ పక్కగా అనుకొన్న ముహూర్తం ప్రకారమే సాగిందట. బుధవారం సాయింత్రం 5 గంటల.. 5 నిమిషాలకు టీజర్‌ని రిలీజ్ చేయాలని త్రివిక్రమ్ ముందే ఫిక్సయ్యాడట. దాన్నో ఫంక్షన్‌లా చేసి, ప్రెస్ మీట్లు పెడితే అనుకొన్న టైమ్‌లో టీజర్‌ని రిలీజ్ చేసే వీలు ఉండదు. అందుకే… ఆన్లైన్ మార్గాన్ని ఎంచుకొన్నాడట త్రివిక్రమ్.
బాబు బంగారం, ప్రేమమ్ సినిమాల ఓపెనింగ్స్నీ త్రివిక్రమే ముహూర్తాలు చూశాడట. ఆ సినిమాల నిర్మాత రాధాకృష్ణ ఈ మాటల మాంత్రికుడికి మంచి దోస్త్ కదా, అందుకే.. ముహూర్త సాయం చేశాడన్నమాట. అన్నట్టు.. సర్దార్ గబ్బర్‌సింగ్ ఓపెనింగ్ కీ ఈయనే ముహూర్తం పెట్టాడట. ఆ సినిమా ఫట్టు మరి! త్రివిక్రమ్ ముహూర్త బలం ఇంత వీకా? అలాగైతే ఈ సినిమాల పరిస్థితేంటో?