త్రివిక్రమ్ రాలేదేలనో?

దర్శకుడు త్రివిక్రమ్ ఓ విలక్షణమైన వ్యక్తి. దర్శకుడు రాజమౌళి మాదిరిగా పిలవగానే వచ్చి, నాలుగు ప్రోత్సాహక వచనాలు చేసి, లేదా ఓ ట్వీట్ చేసి, ఎంకరేజ్ చేసే వ్యవహారం తక్కువ. హారిక హాసిని బ్యానర్ అంటే…

దర్శకుడు త్రివిక్రమ్ ఓ విలక్షణమైన వ్యక్తి. దర్శకుడు రాజమౌళి మాదిరిగా పిలవగానే వచ్చి, నాలుగు ప్రోత్సాహక వచనాలు చేసి, లేదా ఓ ట్వీట్ చేసి, ఎంకరేజ్ చేసే వ్యవహారం తక్కువ. హారిక హాసిని బ్యానర్ అంటే త్రివిక్రమ్ స్వంత బ్యానర్ లాంటిది. ఆ బ్యానర్ వాళ్లకు త్రివిక్రమ్ అంటే బాస్ కింద లెక్క. అంత రెస్పెక్ట్. కానీ అలాంటి సంస్థకు చెందిన రెండో బ్యానర్ తీసిన, రెండు సినిమాల అడియో ఫంక్షన్లకు త్రివిక్రమ్ హాజరు కాలేదు. పిలిచి వుండరు అనే ప్రశ్నే లేదు. ఎందుకంటే చినబాబు గారికి, త్రివిక్రమ్ కు వున్న అనుబంధం అలాంటిది.

పైగా బాబు బంగారం హారిక హాసిని సెకెండ్ యూనిట్ లాంటి సితార ఎంటర్ టైన్ మెంట్స్ తొలి సినిమా. వెంకీ లాంటి పెద్ద హీరో, మారుతి దర్శకుడు. కానీ త్రివిక్రమ్ ఊళ్లో వుండే రాలేదేలనో?

ఇక అదే బ్యానర్ రెండో సినిమా. ప్రేమమ్. ఈ సినిమా పంక్షన్ రోజు ఉదయాన్నే త్రివిక్రమ్ తనకు ఏదో పని వుందని క్యాంప్ వెళ్లిపోయినట్లు వినికిడి. నిజానికి ప్రేమమ్ వ్వవహారాల్లో త్రివిక్రమ్ ఆది నుంచీ ఇన్ వాల్వ్ అయ్యారు. సినిమా చూసి, రీమేక్ కు కావాల్సిన ఇన్ పుట్స్ ఇచ్చారు. మరి అలాంటిది నాగ్, దాసరి, లాంటి హేమాహేమీలు హాజరవుతున్న ఫంక్షన్ కు ఎందుకు హాజరు కానట్లో? హారిక హాసినితో అనుబంధం వున్నవారు, లేనివారు ఎందరో హాజరయ్యారు. త్రివిక్రమ్ తప్ప.

ఏదైనా త్రివిక్రమ్..ఆయన స్నేహితుడు పవన్ ల వైఖరి కాస్త చిత్రంగానే వుంటుంది.